Yuvraj Singh: అఫ్రిది ఫౌండేషన్‌కు మద్దతిచ్చిన యువరాజ్‌, హర్భజన్‌పై నెటిజన్ల ఆగ్రహం

  • కరోనా నేపథ్యంలో ఇబ్బంది పడుతున్న వారికి అఫ్రిది ఫౌండేషన్ సాయం
  • ఆ సంస్థకు విరాళాలు ఇవ్వాలని కోరిన యువీ, భజ్జీ
  • విదేశీ సంస్థకు ఎలా మద్దతిస్తారని అభిమానుల విమర్శలు
 Twitter divided after Yuvraj Singh and Harbhajan Singh support Shahid Afridi

పాకిస్థాన్ మాజీ  క్రికెటర్ షాహిద్ అఫ్రిది ఫాండేషన్‌కు మద్దతివ్వాలంటూ కోరిన టీమిండియా ఆటగాళ్లు యువరాజ్ సింగ్, హర్భజన్ సింగ్‌పై నెటిజన్లు, అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సాయం చేయాలనుకుంటే ఇండియాలో చేయండి, కానీ విదేశీ సంస్థలకు మద్దతివ్వడం ఏంటని ప్రశ్నిస్తున్నారు. అఫ్రిది ఫౌండేషన్‌కు విరాళాలు ఇవ్వాలని చెప్పడంలో ఉద్దేశం ఏంటని నిలదీస్తున్నారు. 

పాక్‌లో కరోనా వైరస్ నేపథ్యంలో ఇబ్బందిపడుతున్న వారికి అఫ్రిది ఫౌండేషన్ కొన్ని వస్తువులను, ఆహారాన్ని సమకూరుస్తోంది. అవసరమైన వారికి వైద్య సామగ్రితోపాటు  తినడానికి కావాల్సిన పదార్థాలను అందజేస్తోంది. ఈ విషయం తెలిసిన యువరాజ్‌.. ఈ కష్టకాలంలో వీలైనంత వరకు అఫ్రిది ఫౌండేషన్‌కు విరాళాలు ఇవ్వాలని ట్వీట్ చేశాడు. దీనికి హర్భజన్ కూడా మద్దతిచ్చాడు. ‘ప్రపంచం మొత్తం కష్టాలను ఎదుర్కొంటోంది. ఈ సమయంలోనే అవసరమైన వారిని ఆదుకోవాల్సిన బాధ్యత మనపై ఉందని’ ట్వీట్ చేశాడు.

వీరిద్దరి ట్వీట్స్‌ చూసిన నెటిజన్లు, అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘సాయం చేయడంలో తప్పు లేదు. కానీ మీరు ఎలాంటి సాయం చేస్తున్నారు?' అంటూ ఈ ఇద్దరు క్రికెటర్లను కొందరు ప్రశ్నిస్తున్నారు. యువీ, భజ్జీ చేసిన ఈ పని పరువు తీసేలా ఉందని ధ్వజమెత్తారు.

More Telugu News