Somireddy Chandra Mohan Reddy: చిన్నవయస్సులోనే పెద్ద మనస్సు చాటుకున్నారంటూ హీరో ప్రభాస్ పై సోమిరెడ్డి ప్రశంసలు

TDP leader Somireddy appreciates Hero Prabhas
  • ‘కరోనా’పై పోరాటానికి రూ.4 కోట్ల విరాళమిచ్చిన ప్రభాస్ 
  • ‘కరోనా’ విరాళాల్లోనూ ప్రభాస్ ది రికార్డే
  •  ప్రభాస్ కు అభినందనలు తెలియజేస్తున్నా
కరోనా వైరస్ వ్యాప్తి చెందకుండా చేస్తున్న కేంద్రం, రెండు తెలుగు రాష్ట్ర ప్రభుత్వాలకు టాలీవుడ్ హీరో ప్రభాస్ భారీ విరాళం ప్రకటించిన విషయం తెలిసిందే. దీనిపై టీడీపీ నేత  సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి స్పందిస్తూ ప్రభాస్ పై ప్రశంసలు కురిపించారు.

‘బాహుబలి’ చిత్ర రికార్డుల్లోనే కాదు, ‘కరోనా’ విరాళాల్లోనూ తెలుగు సినీ రంగంలో ప్రభాస్ ముందుండటం అభినందనీయమని కొనియాడారు.. చిన్న వయస్సులోనే పెద్ద మనస్సు చాటుకుంటూ ప్రధాన మంత్రి సహాయ నిధికి రూ.3 కోట్లు, ఏపీ, తెలంగాణల సీఎంల సహాయనిధికి కోటి రూపాయలు ఇవ్వడం చాలా గొప్ప విషయమని ప్రశంసిస్తూ ఓ ట్వీట్ చేశారు.
Somireddy Chandra Mohan Reddy
Telugudesam
Prabhas
Tollywood

More Telugu News