Keeravani: ‘కరోనా’ కట్టడికి ట్యూన్ కట్టిన సినీ సంగీత దర్శకుడు కీరవాణి!

  • జూనియర్ ఎన్టీఆర్ ’సినిమా స్టూడెంట్ నెం.1’
  • ‘ఎక్కడో పుట్టి ఎక్కడో పెరిగి ..’ పాట ట్యూన్ తో ఈ పాట పాడిన కీరవాణి
  • ‘ఓ మైడియర్ గార్ల్స్, డియర్ బాయ్స్..’ అంటూ పాట ప్రారంభం
Cine Music Director Keeravani sings a song about to control corona

కరోనా వైరస్ వ్యాప్తి నిరోధక చర్యల నిమిత్తం ప్రజలను చైతన్య పరుస్తూ ప్రముఖ సినీ సంగీత దర్శకుడు కీరవాణి ఓ పాట రాశారు. ఆ పాటకు స్వయంగా సంగీతం సమకూర్చి, తనే పాడి రిలీజ్ చేశారు. ఇందుకు సంబంధించిన ఓ వీడియో సామాజిక మాధ్యమాల్లోకి చేరి వైరల్ అయింది. గతంలో హీరో జూనియర్ ఎన్టీఆర్ నటించిన స్టూడెంట్ నెం.1 సినిమా కోసం తాను చేసిన 'ఎక్కడో పుట్టి ఎక్కడో పెరిగి ..’ అంటూ సాగే పాప్యులర్ సాంగ్ బాణీని తీసుకుని ఈ పాటను కీరవాణి రూపొందించారు.

‘ఓ మైడియర్ గార్ల్స్, డియర్ బాయ్స్..డియర్ మేడమ్స్.. భారతీయులారా..’ అంటూ సాగే ఈ సాంగ్ లో ‘ఎక్కడో పుట్టి ఎక్కడో పెరిగి ఇక్కడే చేరింది మహమ్మారి రోగమొక్కటి..’ అంటూ తన పాటను పాడారు. ఈ సందర్భంగా ‘కరోనా’ వ్యాప్తి చెందకుండా ఉండేందుకు పాటించాల్సిన ముందు జాగ్రత్తలను తన పాట ద్వారా సూచించారు. ‘కరోనా’ కట్టడికి పాటుపడుతున్న వైద్య ఆరోగ్య, పోలీస్, పారిశుద్ధ్య సిబ్బందికి తన కృతఙ్ఞతలు తెలిపారు. చివరగా, ‘వుయ్ విల్ స్టే ఎట్ హోమ్.. వుయ్ స్టే సేఫ్’ అంటూ తన పాట ద్వారా ప్రజలను అప్రమత్తం చేశారు. 

More Telugu News