Narendra Modi: రేపు అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులతో ప్రధాని వీడియో కాన్ఫరెన్స్

PM Modi conducts Video conference with all states cms tomorrow
  • కోవిడ్-19 విస్తరిస్తున్న నేపథ్యంలో సమావేశం
  • ఆయా రాష్ట్రాల్లో ‘కరోనా’ పరిస్థితిపై ఆరా తీయనున్న మోదీ 
  • కరోనా నిరోధానికి పలు సూచనలు చేయనున్న ప్రధాని
కోవిడ్-19 తీవ్రంగా విస్తరిస్తున్న నేపథ్యంలో ప్రధాని నరేంద్ర మోదీ అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులతో మరోమారు మాట్లాడనున్నారు. ఈ క్రమంలో రేపు వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించనున్నారు. ఆయా రాష్ట్రాల్లో ‘కరోనా’ పరిస్థితి, చేపడుతున్న చర్యలు మొదలైన విషయాల గురించి సీఎంలను అడిగి తెలుసుకోనున్నట్టు సమాచారం. అలాగే పలు సూచనలు కూడా చేయనున్నారు. కాగా, గత నెలలో అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులతో మోదీ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ‘కరోనా’ వ్యాప్తి నిరోధక చర్యలపై ఆయన పలు సూచనలు చేశారు.
Narendra Modi
Prime Minister
Video conference
All States Cm`s

More Telugu News