lpg: సబ్సిడీయేతర ఎల్‌పీజీ సిలిండర్‌ ధర రూ.65 తగ్గుదల

  • గత నెలలో ఎల్‌పీజీ సిలిండర్‌ ధర రూ. 805
  • ప్రపంచ వ్యాప్తంగా 55 శాతం తగ్గిన క్రూడ్‌ ధరలు
  • తగ్గిన ధరలతో రూ.744కే ఎల్‌పీజీ సిలిండర్‌ 
lpg price reduces

సబ్సిడీయేతర ఎల్‌పీజీ సిలిండర్‌ ధరను రూ.65 తగ్గిస్తున్నట్లు ఇండియన్‌ ఆయిల్‌ కార్పొరేషన్‌ (ఐఓసీ) ప్రకటించింది. కరోనా విజృంభణ నేపథ్యంలో దేశ వ్యాప్తంగా లాక్‌డౌన్‌ విధించడంతో ప్రజలు ఎన్నో ఇబ్బందులు పడుతోన్న నేపథ్యంలో ఎల్‌పీజీ సిలిండర్‌ ధర తగ్గడం కాస్త ఉపశమనం కలిగించే విషయమే.

గత నెలలో ఎల్‌పీజీ సిలిండర్‌ ధర రూ. 805.5గా ఉన్న విషయం తెలిసిందే. ప్రపంచ వ్యాప్తంగా క్రూడ్‌ ధరలు 55 శాతం మేర తగ్గాయి. ఈ నేపథ్యంలో ఎల్‌పీజీ సిలిండర్ల రేట్లు తగ్గిస్తూ నిర్ణయం తీసుకున్నారు. నేటి నుంచే కొత్త ధరలు అమల్లోకి రానున్నాయి. దీంతో ఎల్‌పీజీ సిలిండర్‌ ఇప్పుడు రూ.744కి లభించనుంది.  

More Telugu News