pensions: ఉదయం 9 గంటలకే 65 శాతం మందికి పింఛన్ల పంపిణీ పూర్తి: ఏపీ అధికారులు

  • ప్రత్యేక జాగ్రత్తలతో పనిపూర్తి చేస్తున్న వలంటీర్లు 
  • వేలిముద్రలు కాకుండా ఫొటో గుర్తింపు కార్డుతో అందజేత 
  • రాష్ట్రంలో 59 లక్షల మంది లబ్ధిదారులు
65 percent pensions distributed before 9am says ap officilas

లాక్ డౌన్ కారణంగా ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్న నిరుపేదలకు భరోసా ఇవ్వాలన్న ఉద్దేశంతో ఇంటింటికీ పింఛన్ల పంపిణీ విజయవంతంగా సాగుతోందని ఏపీ అధికారులు తెలిపారు. కరోనా భయం నేపథ్యంలో వలంటీర్లు ఉదయం 6 గంటల నుంచే లబ్ధిదారుల ఇళ్లకు వెళ్లి వేలి ముద్రలు కాకుండా గుర్తింపు కార్డు ఆధారంగా పింఛన్ అందజేసినట్లు తెలిపారు. రాష్ట్రంలో మొత్తం 59 లక్షల మంది లబ్ధిదారులు ఉండగా ఉదయం 9 గంటల సమయానికి 65 శాతం మందికి పింఛన్ల పంపిణీ పూర్తయిందని తెలిపారు.

More Telugu News