New Delhi: నిజాముద్దీన్‌లో తబ్లిగి జమాత్‌ నిర్వాహకులపై కేసు నమోదు

case againist tablighi jamat meet presiders
  • జామామసీదు వజీరాబాద్‌ ఇమామ్‌పై కూడా
  • వెల్లడించిన ఢిల్లీ పోలీసు కమిషనర్‌ శ్రీవాత్సవ
  • అంటువ్యాధుల చట్టం 1897 ప్రకారం కేసు
దేశవ్యాప్తంగా కరోనా కేసులు అత్యంత వేగంగా పెరగడానికి కారణం దేశ రాజధాని  ఢిల్లీలోని నిజాముద్దీన్‌లో జరిగిన తబ్లిగా జమాత్‌ కార్యక్రమానికి హాజరైన వారివల్లేనన్న అనుమానాలు బలపడుతున్న వేళ నిర్వాహకులపై పోలీసులు దృష్టిసారించారు.

ఈ కార్యక్రమానికి హాజరైన వారిలో 24 మందికి కరోనా పాజిటివ్‌ అని నిర్థారణ అయ్యింది. అలాగే నిన్న ఒక్కరోజే దేశవ్యాప్తంగా 146 కొత్త కేసులు నమోదుకావడం, బాధితుల్లో ఎక్కువ మంది ఈ సమావేశానికి హాజరైన వారే కావడం గమనార్హం. దీంతో నిర్వాహకులపై కేసు నమోదు చేయాలని ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్‌ కేజ్రీవాల్‌ లెఫ్టినెంట్‌ గవర్నర్‌కు లేఖ రాశారు.

ఈ మేరకు ‘అంటువ్యాధుల చట్టం 1897’ ప్రకారం నిర్వాహకులు మౌలానాసాద్‌ తదితరులపై ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేసినట్లు  ఢిల్లీ  పోలీస్‌ కమిషనర్‌ ఎస్‌.ఎన్‌.శ్రీవాత్సవ్‌ తెలిపారు. అలాగే, ఈ మర్కాజ్‌కు హాజరైన 12 మంది విదేశీయుల సమాచారాన్ని దాచిపెట్టిన జామా మసీదు వజీరాబాద్‌ ఇమామ్‌పై కూడా కేసు నమోదు చేసినట్లు తెలిపారు.

మరోవైపు నిజాముద్దీన్‌లోని మర్కజ్‌లో ఉన్న వ్యక్తులను క్వారంటైన్‌కు నిన్న అర్ధరాత్రి తర్వాత తరలించారు. తొలుత వారి తరలింపునకు నిర్వాహకుడు మౌలానాసాద్‌ సహకరించకపోవడంతో జాతీయ భద్రతా సహాదారు అజిత్‌ దోవల్  రంగంలోకి దిగారు. మౌలానాసాద్‌తో మాట్లాడి పని సాఫీగా పూర్తయ్యేలా చేశారు.
New Delhi
tablighi jamate
case

More Telugu News