Roja: దేశం మొత్తం లాక్‌డౌన్‌లో ఉంటే.. విలేజ్ వారియర్స్ మాత్రం పని చేస్తున్నారు.. హ్యాట్సాఫ్‌: వాలంటీర్లకు ఎమ్మెల్యే రోజా ప్రశంసలు

  • ఇంటింటికీ వెళ్లి పింఛన్లు అందజేస్తోన్న వాలంటీర్లు
  • వేలి ముద్ర స్థానంలో ఫొటో గుర్తింపుతో పింఛన్లు
  • వారి సేవలను కొనియాడిన రోజా
While the Entire nation is on lockdown  AP Village Warriors are helping those who are hit the hardest

ఆంధ్రప్రదేశ్‌లో పింఛను లబ్ధిదారులకు అందాల్సిన డబ్బును కరోనా విజృంభణ నేపథ్యంలో గ్రామ వాలంటీర్లు అందిస్తున్నారు. ఈ రోజు ఉదయం 6 గంటల నుంచే లబ్ధిదారుల ఇంటింటికీ వెళ్లి పింఛన్లు అందజేశారు. వేలి ముద్ర స్థానంలో ఫొటో గుర్తింపుతో పింఛన్లు అందజేస్తున్నారు.  

ఈ నేపథ్యంలో వాలంటీర్ల సేవలను వైసీపీ ఎమ్మెల్యే రోజా కొనియాడారు. 'దేశం మొత్తం లాక్‌డౌన్‌లో ఉంటే.. పౌరులు ఇంట్లోనే ఉంటూ కొవిడ్-19తో పోరాడుతుంటే, మన ఏపీ విలేజ్‌ వారియర్స్‌ మాత్రం.. ఇబ్బందులు పడుతున్న వారికి సాయం అందిస్తూ పని చేస్తున్నారు. హ్యాట్సాఫ్‌ టు వాలంటీర్స్‌.. పింఛనులను డోర్‌ డెలివరీ చేస్తూ గొప్ప సేవలు అందిస్తున్నారు' అని ట్వీట్ చేశారు. 

More Telugu News