america: అమెరికా యుద్ధ‌ నౌక‌లో 100 మందికి కరోనా.. నౌకలో మరో 3,900 మందికి సోకే ప్రమాదం

  • యుద్ధ నౌక థియోడ‌ర్ రూజ్‌వెల్ట్ లో చిక్కుకుపోయిన 4,000 మంది
  • కాపాడాలంటూ పెంటగాన్‌కు నౌక కెప్టెన్‌ లేఖ 
  • కరోనా సోకిన వారిని నౌకలో వేరుగా ఉంచడం ఇబ్బందిగా ఉంద‌ని వ్యాఖ్య
 US Navy captain pleads for help over outbreak

అమెరికా యుద్ధ నౌక థియోడ‌ర్ రూజ్‌వెల్ట్ లో 4,000 మంది చిక్కుకుపోయారు. వారిలో 100 మంది సిబ్బందికి ఇప్ప‌టికే క‌రోనా సోకింది. వారి వల్ల మిగతా 3,900 మందికీ వైరస్ సోకే ప్రమాదం ఉండడంతో ఆందోళన వ్యక్తమవుతోంది. దీంతో వెంట‌నే త‌మ‌ను కాపాడాలంటూ పెంటగాన్‌కు నౌక కెప్టెన్‌  బ్రెట్ క్రోజ‌ర్ లేఖ రాశారు.

ఇప్పటికే కరోనా సోకిన వారిని నౌకలో వేరుగా ఉంచడం ఇబ్బందిగా ఉంద‌ని చెప్పారు. న్యూక్లియ‌ర్ ఎయిర్‌క్రాప్ట్ ను మోసుకెళ్లగలిగే థియోడ‌ర్ రూజ్‌వెల్ట్ నౌకలో ప్రస్తుతం చాలా దుర్భర ప‌రిస్థితులు ఉన్నాయని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. తాము ప్రస్తుతం యుద్ధ క్షేత్రంలో ఏమీ లేమని, నావికులు ప్రాణాలు కోల్పోవలసిన అవ‌స‌రం లేద‌ంటూ ఆయన అందులో పేర్కొన్నారు. ఆ నౌక‌లో ఉన్న అందరినీ క్వారంటైన్‌కు తరలించాలని కోరారు.

More Telugu News