Ramoji Rao: కష్టకాలంలో రామోజీరావు తన పెద్దమనసు చాటుకున్నారు: మాజీ మంత్రి సోమిరెడ్డి

hatsoff ramojisir says somireddy
  • తెలుగు రాష్ట్రాలకు రూ.20 కోట్ల విరాళం అభినందనీయం
  • ఆయనకు హృదయపూర్వక ధన్యవాదాలు
  • ఆంధ్ర, తెలంగాణకు చెరో రూ.10 కోట్లు ఇచ్చిన రామోజీరావు
కష్టకాలంలో రెండు తెలుగు రాష్ట్రాలకు పెద్దమొత్తంలో ఆర్థిక సహాయం అందజేసి ఈనాడు గ్రూపు సంస్థల అధినేత చెరుకూరి రామోజీరావు తన పెద్దమనసు చాటుకున్నారని మాజీ మంత్రి, తెలుగుదేశం పార్టీ నాయకుడు సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి అన్నారు. కరోనా కట్టడికి ఆంధ్ర, తెలంగాణ ప్రభుత్వాలు చేస్తున్న కృషికి తనవంతు సాయంగా రామోజీరావు చెరో రూ.10 కోట్లు చొప్పున విరాళం ప్రకటించిన విషయం తెలిసిందే.

ముఖ్యమంత్రులను నేరుగా కలిసి నిధులు అందించేందుకు లాక్‌డౌన్‌ ఉన్న కారణంగా ఆన్‌లైన్‌లో ఈ నిధులను రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రుల సహాయ నిధికి బదిలీ చేశారు. ఈ సందర్భాన్ని పురస్కరించుకుని సోమిరెడ్డి ట్విట్టర్లో స్పందించారు. కష్టకాలంలో రామోజీరావు తన పెద్దమనసు చాటుకున్నారని అభినందనలు కురిపించారు.
Ramoji Rao
Somireddy Chandra Mohan Reddy
Corona Virus
donation

More Telugu News