TSSPDCL: కరోనా ఎఫెక్ట్‌...ఈ నెల విద్యుత్‌ బిల్లు ఇలా లెక్కిస్తారు!

  • గడచిన మూడు నెలల బిల్లు సగటు ప్రాతిపదిక
  • వైరస్‌ వ్యాప్తి కారణంగా రీడర్లను ఇళ్లకు రానివ్వరు
  • దీంతో ఇలా చేయాలని దక్షిణ తెలంగాణ విద్యుత్‌ పంపిణీ సంస్థ నిర్ణయం
electricity billwill caluculate in three months avarage method

ప్రస్తుతం కరోనా భయం జనాన్ని వెంటాడుతోంది. ఇతరులను ఇళ్ల సమీపంలోకి కూడా రానివ్వడం లేదు. విద్యుత్‌ మీటర్‌ రీడర్లు ఇళ్లకు వచ్చినా ఇదే పరిస్థితి ఎదురవుతుంది. ఈ పరిస్థితుల్లో మరి విద్యుత్‌ బిల్లుల లెక్కింపు ఎలా? ఇందుకు దక్షిణ తెలంగాణ విద్యుత్‌ పంపిణీ సంస్థ ఓ ఆలోచన చేస్తోంది. ఫిబ్రవరికి ముందు వినియోగదారుడు చెల్లించిన మూడు నెలల బిల్లును సగటు ప్రాతిపదికన లెక్కించి, మార్చి నెల విద్యుత్‌ వాడకాన్ని అంచనావేసి ఆన్‌లైన్‌లో పొందుపరచాలని నిర్ణయించింది.

అంటే గడచిన మూడునెలల్లో మీరు మొత్తం రూ.1800లు చెల్లించారనుకుందాం. ఈ మొత్తాన్ని మూడుతో భాగించి రూ.600లు ఈ నెల బిల్లుగా లెక్కిస్తారు. దీనిపై డిస్కంలు ఇప్పటి వరకు అధికారికంగా ఎటువంటి ప్రకటన చేయకపోయినా గతనెలలో వసూళ్లలో 28 శాతం తగ్గుదల కనిపించడంతో ఈ నిర్ణయం తీసుకోనున్నట్లు సమాచారం.

ఈ బిల్లును కూడా ఇంటికి ఇవ్వరు. ఆన్‌లైన్‌లోనే కనిపిస్తాయి. వినియోగదారులు కూడా ఆన్‌లైన్‌లోనే చెల్లింపులు చేయాలి. ఇందుకు టీఎస్‌ఎస్పీడీసీఎల్‌ వెబ్‌ సైట్‌, మొబైల్‌ యాప్‌, ఇతర యాప్‌లు, టీఎస్‌ఆన్‌లైన్‌, మీ సేవల్లో చెల్లించవచ్చునని డిస్కం పేర్కొంది. లాక్‌డౌన్‌ అనంతరం మరుసటి నెల మీటర్‌ రీడింగ్‌ ఆధారంగా బిల్లులు జారీచేస్తారు.

More Telugu News