CNN: కరోనా నేపథ్యంలో... అత్యంత సురక్షితమైన, అత్యంత ప్రమాదకరమైన దేశాల గురించి చెప్పిన పీవీపీ!

  • ప్రపంచాన్ని పీడిస్తున్న కరోనా మహమ్మారి
  • ప్రమాదకరమైన దేశాల్లో లేని ఇండియా
  • సీఎన్ఎన్ వెల్లడించిందన్న పీవీపీ
Top 10 Risk and Safe Countries

ప్రపంచాన్ని కరోనా వైరస్ మహమ్మారి పట్టి పీడిస్తున్న వేళ, ప్రజలకు అత్యంత సురక్షితమైన, అత్యంత ప్రమాదకరమైన దేశాల జాబితాను సీఎన్ఎన్ ప్రకటించిందని వైెఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేత పీవీపీ వెల్లడించారు.

ఆ సమాచారం మేరకు ఇండియా సురక్షితమైన దేశాల సరసన కాకపోయినా, ప్రమాదకరమైన దేశాల జాబితాలో మాత్రం లేదని ఆయన అన్నారు. ఇక ఇదే విషయాన్ని తన ట్విట్టర్ ఖాతాలో వెల్లడించిన పీవీపీ, ప్రభుత్వం మరియు యంత్రాంగం మన దేశాన్ని సురక్షితమైన మరియు సమర్థవంతమైన దేశంగా మలచాలని ప్రతి పౌరుని కోరికని వ్యాఖ్యానించారు.

పీవీపీ పోస్ట్ చేసిన సీఎన్ఎన్ స్క్రీన్ షాట్ వివరాల మేరకు అత్యంత సురక్షితమైన దేశాల్లో తొలి స్థానంలో ఇజ్రాయిల్ ఉంది. ఆపై టాప్-10లో సింగపూర్, స్లొవేకియా, న్యూజిలాండ్, హాంకాంగ్, తైవాన్, హంగేరీ, ఆస్ట్రియా, జర్మనీ, గ్రీన్ ల్యాండ్ ఉన్నాయి.

10 అత్యంత ప్రమాదకర దేశాల జాబితా తొలి మూడు స్థానాల్లో ఇటలీ, ఇండొనేషియా, స్పెయిన్ ఉన్నాయి. ఆపై ఇరాక్, ఇరాన్, నెదర్లాండ్స్, ఫ్రాన్స్, యూఎస్ఏ, యూకే, ఫిలిప్పీన్స్ టాప్-10లో ఉన్నాయి.

ఇదే సమయంలో కరోనా వ్యాధి సోకితే, అత్యుత్తమ చికిత్సా విధానాలు ఉన్న దేశాల జాబితాను పరిశీలిస్తే, సింగపూర్, సౌత్ కొరియా, హాంకాంగ్, తైవాన్, చైనా, జపాన్, జర్మనీ, ఆస్ట్రియా, యూఏఈ, బెహరైన్ దేశాలు టాప్-10లో ఉన్నాయి.

More Telugu News