Janagaon: జనగామలో భయం భయం.. నిజాముద్దీన్ నుంచి వచ్చి ఊరంతా తిరిగిన ముగ్గురు వ్యక్తులు

Five people from Jangaon attended Markaz Masjid meeting
షార్ట్స్‌లో చూడండి
తెలంగాణలోని జనగామ జిల్లా వాసులు ఇప్పుడు భయంభయంగా గడుపుతున్నారు. ఢిల్లీ నిజాముద్దీన్‌లోని మర్కజ్ మసీదు ప్రార్థనలకు వెళ్లివచ్చిన వారిలో ముగ్గురు ఊరంతా కలియదిరగడమే ఇందుకు కారణం. జనగామతోపాటు జిల్లాలోని వెల్దండకు చెందిన ఐదుగురు వ్యక్తులు గత నెల 15న నిజాముద్దీన్ వెళ్లారు. వీరిలో ఇద్దరు ఢిల్లీలోనే ఉండిపోగా ముగ్గురు మాత్రం మార్చి 17న విమానంలో హైదరాబాద్ చేరుకుని అక్కడి నుంచి స్వగ్రామాలకు చేరుకున్నారు.

ఢిల్లీ నుంచి వచ్చిన ముగ్గురిలో ఒకరు ప్రభుత్వ ఉపాధ్యాయుడు కాగా, మరొకరు జిల్లా గ్రామీణాభివృద్ధి కార్యాలయ ఉద్యోగి అని తేలింది. మరొకరు ప్రైవేటు ఉద్యోగి. వీరు ఢిల్లీ వెళ్లి వచ్చినట్టు ముందే సమాచారం అందుకున్న అధికారులు వివరాలు ఆరా తీయగా తాము ఢిల్లీ వెళ్లలేదని బుకాయించినట్టు తెలుస్తోంది. అయితే, వీరు ఢిల్లీ నుంచి వచ్చిన తర్వాత హోం క్వారంటైన్‌లో ఉండకుండా ఊరంతా తిరిగినట్టు తెలియడంతో ఆందోళన నెలకొంది. జనగామకు చెందిన ఇద్దరినీ వరంగల్ ఎంజీఎంకు తరలించిన అధికారులు, వారి కుటుంబ సభ్యులను హోం ఐసోలేషన్‌లో ఉంచారు. వెల్దండకు చెందిన మరో వ్యక్తి, అతడి కుటుంబ సభ్యులను సికింద్రాబాద్ గాంధీ ఆసుపత్రికి తరలించారు.
Go Back to Shorts
Janagaon
Markaz Masjid
New Delhi
Nizamuddin
Telangana

More Telugu News