Kanika Kapoor: బాలీవుడ్ సింగర్ కనికకు మళ్లీ పాజిటివ్!

Bolly wood singer Kanika Kapur gets fifth time positive
  • లక్నోలో చికిత్స పొందుతున్న కనిక కపూర్
  • ఐదోసారి నిర్వహించిన టెస్టులోనూ పాజిటివే
  • ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్న వైద్యులు
కరోనా వైరస్ బారిన పడి చికిత్స పొందుతున్న బాలీవుడ్ సింగర్ కనికాకపూర్ కు మరోమారు నిర్వహించిన టెస్టుల్లో ‘పాజిటివ్’ వచ్చింది. ఇప్పటికే నాలుగుసార్లు నిర్వహించిన టెస్టుల్లో ఆమెకు ‘పాజిటివ్’ వచ్చింది. తాజాగా, ఇవాళ నిర్వహించిన టెస్టులోనూ ‘పాజిటివ్’ రావడంపై ఆసుపత్రి వర్గాలు స్పందిస్తూ, కనిక ఆరోగ్య పరిస్థితి నిలకడగానే ఉందని, ఆందోళన చెందాల్సిన అవసరం లేదని చెబుతున్నారు. కాగా, లక్నోలోని సంజయ్ గాంధీ పోస్ట్ గ్రాడ్యుయేట్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ లో కనికకు ‘కరోనా’ ట్రీట్ మెంట్ కొనసాగుతోంది. ఈ వైరస్ సోకిన పేషెంట్లకు 48 గంటలకు ఒకసారి పరీక్షలు నిర్వహిస్తారు.
Kanika Kapoor
Bollywood
singer
Corona Virus
postive

More Telugu News