Kona Venkat: ఆత్మహత్య చేసుకోవాలనుకున్నా .. ఆ పాపను చూసి మానుకున్నా: కోన వెంకట్

  • చెన్నైలో వర్మ కోసం ఎదురుచూస్తున్నాను 
  • నా దగ్గరున్న డబ్బులన్నీ అయిపోతున్నాయి 
  • ఆ అమ్మాయిని చూసి షాక్ అయ్యానన్న కోన
Kona venkat

తాజాగా 'ఆలీతో సరదాగా' కార్యక్రమంలో రచయిత కోన వెంకట్ మాట్లాడుతూ, ఒక ఆసక్తికరమైన విషయాన్ని గురించి ప్రస్తావించారు. 'తోకలేని పిట్ట' సినిమా నష్టాలతో నేను రోడ్డున పడిపోయాను. వర్మ తన కంపెనీలో అవకాశం ఇస్తాడేమో కనుక్కుందామని కాల్ చేస్తే, త్వరలో తానే చెన్నై వస్తున్నట్టు చెప్పాడు. 'సాలిగ్రామం'లో ఆయనకి ఆఫీసు వుంది. రోజులు గడుస్తున్నాయి .. నా దగ్గరున్న డబ్బులు అయిపోతున్నాయి .. వర్మ రావడం లేదు.

ఇక బతకడం అనవసరమని భావించి, ఉన్న కాసిన్ని డబ్బులతో నిద్రమాత్రలు .. ఒక వాటర్ బాటిల్ కొనుక్కుని 'మెరీనా బీచ్' కి వెళ్లాను. ఆ సమయంలో కాళ్లు చేతులులేని ఏడెనిమిదేళ్ల అమ్మాయి ఒక ట్రాలీపై కూర్చుని ఎదురుపడింది. ఆ ట్రాలీకి బెలూన్స్ కట్టి వున్నాయి .. తన అన్నయ్య ట్రాలీ తోస్తుంటే, బెలూన్స్ కొనమని ఎంతో హుషారుగా అడుగుతోంది. కాళ్లు .. చేతులు లేకపోయినా బతుకు పట్ల ఆమెకి గల ఆశ .. ఆనందం చూసి ఆశ్చర్యపోయాను. భగవంతుడు నాకు అన్నీ ఇచ్చాడు .. అలాంటప్పుడు ఇంత పిరికితనం ఎందుకు? అనుకుని, ఆత్మ హత్య చేసుకోవాలనే ఆలోచనను విరమించుకున్నాను" అని చెప్పుకొచ్చారు.

More Telugu News