Vijay: తమిళ హీరో విజయ్ ఇంట్లో కరోనా పరీక్షలు నిర్వహించిన అధికారులు

Corona tests for hero Vijay and his family members
  • తమిళనాడులో కరోనా విజృంభణ
  • 74కి చేరిన కరోనా పాజిటివ్ కేసులు
  • ఇటీవలే విదేశాలకు వెళ్లొచ్చిన హీరో విజయ్
  • పరీక్షల్లో విజయ్ కుటుంబానికి నెగెటివ్ వచ్చిందన్న అధికారులు
కరోనా వైరస్ భూతం తమిళనాడు రాష్ట్రంలోనూ ప్రమాద ఘంటికలు మోగిస్తోంది. సోమవారం ఒక్కరోజే 17 పాజిటివ్ కేసులు వెలుగుచూడడంతో రాష్ట్రవ్యాప్తంగా భయాందోళనలు నెలకొన్నాయి. ఇవాళ మరో 7 కేసులను గుర్తించడంతో తమిళనాడులో కరోనా బాధితుల సంఖ్య 74కి పెరిగింది. ఈ క్రమంలో ఇటీవల విదేశాలకు వెళ్లొచ్చిన వారి జాబితాను సిద్ధం చేసిన ప్రభుత్వం వారికి కరోనా పరీక్షలు నిర్వహిస్తోంది. ఈ లిస్టులో అగ్రహీరో విజయ్ కూడా ఉండడంతో అధికారులు ఆయన నివాసానికి వెళ్లారు. విజయ్ తో పాటు కుటుంబసభ్యులందరికీ కరోనా పరీక్షలు నిర్వహించారు. అయితే, విజయ్, ఆయన కుటుంబసభ్యులకు కరోనా నెగెటివ్ వచ్చిందని తమిళనాడు రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ వెల్లడించింది.
Vijay
Tamilnadu
Corona Virus
COVID-19
Negative

More Telugu News