KTR: స్టాలిన్ సార్... అందరినీ జాగ్రత్తగా చూసుకుంటున్నాం ... ఒక్కొక్కరికి 12 కిలోల బియ్యం, రూ. 500 ఇచ్చాం: కేటీఆర్

KTR Says Will take care all of tamilians stucked in Balkonda
  • స్టాలిన్ అభ్యర్ధనపై వెంటనే స్పందించిన కేటీఆర్   
  • తమిళ వ్యాపారులను కలిసిన స్థానిక అధికారులు
  • ట్విట్టర్ ఖాతాలో వెల్లడి
తమిళనాడుకు చెందిన పలువురు చిరు వ్యాపారులు నిజామాబాద్ జిల్లా, బాల్కొండ, కిసాన్ నగర్ లో చిక్కుకున్నారని, వారిని ఆదుకోవాలని డీఎంకే అధినేత ఎంకే స్టాలిన్ చేసిన విజ్ఞప్తిపై స్పందించిన తెలంగాణ మంత్రి కేటీఆర్, వారి వద్దకు అధికారులను పంపించారు. కేటీఆర్ ఆదేశాల మేరకు కిసాన్ నగర్ వెళ్లిన అధికారులు, మొత్తం ఆరుగురు తమిళులను గుర్తించి ఒక్కొక్కరికీ 12 కిలోల బియ్యం, రూ. 500 చొప్పున డబ్బును అందించారు. ఈ విషయాన్ని తన ట్విట్టర్ ఖాతా ద్వారా వెల్లడించిన కేటీఆర్, "సార్... అందరినీ జాగ్రత్తగా చూసుకుంటాం. స్థానిక అధికారులు వారి వద్దకు వెళ్లి 12 కిలోల చొప్పున బియ్యం, రూ. 500 డబ్బులు ఇచ్చారు" అని తెలిపారు.
KTR
Stalin
Nizamabad District
Rice
Cash
Twitter

More Telugu News