Dil Raju: టాలీవుడ్ లో కరోనా వల్ల నష్టం దిల్ రాజుకే ఎక్కువట!

Huge Loss for Dil Raju
  • లాక్ డౌన్ కారణంగా నిలిచిన షూటింగ్ లు
  • థియేటర్ల నుంచి ఆగిపోయిన ఆదాయం
  • నిలిచిన 'వి' విడుదల, ఆగిన 'వకీల్ సాబ్' షూటింగ్
కరోనా వ్యాప్తిని అరికట్టేందుకు దేశవ్యాప్తంగా లాక్ డౌన్ ను అమలు చేస్తుండగా, ఆ ప్రభావం సినీ రంగంపైనా పడింది. ఎన్నో సినిమాల విడుదల నిలిచిపోగా, షూటింగ్‌ లు ఆగిపోవడంతో సినీ కార్మికులు ఉపాధి లేక ఇబ్బందులు పడుతున్నారు. ఇక టాలీవుడ్‌ లో మిగతా నిర్మాతలతో పోలిస్తే, దిల్ రాజుకే కరోనా కారణంగా అత్యధిక నష్టం ఏర్పడిందని టాలీవుడ్ వర్గాలు అంటున్నాయి.

వాస్తవానికి ఉగాది పండగ సందర్భంగా 25న నాని, సుధీర్ బాబు నటించిన 'వి' విడుదల కావాల్సి వుండగా, అది వాయిదా పడింది. ఇంద్రగంటి మోహన్‌క‌ృష్ణ దర్శకత్వంలో తయారైన ఈ చిత్రం కోసం దిల్ రాజు సుమారు రూ. 40 కోట్లు ఖర్చుపెట్టినట్టు సమాచారం.

ఇక పవన్ కల్యాణ్ హీరోగా 'వకీల్ సాబ్' షూటింగ్ సగం పూర్తయిన తరువాత ఆ సినిమాపైనా కరోనా ప్రభావం పడింది. ఇప్పటికే దానిపై రూ. 30 కోట్ల వరకూ దిల్ రాజు ఇన్వెస్ట్ చేశారు. ఇక తెలుగు రాష్ట్రాల్లో ఎన్నో థియేటర్లు ఆయన అధీనంలో ఉండగా, వాటి నుంచి వచ్చే ఆదాయం నిలిచిపోయింది. అయినా సిబ్బందికి వేతనాలు చెల్లించాల్సి రావడం ఆయనపై పడ్డ మరో భారం. మొత్తం మీద ఇతర నిర్మాతలతో పోల్చుకుంటే, దిల్ రాజుపై కరోనా నష్టం అధికంగానే ఉందని టాలీవుడ్ చర్చించుకుంటోంది.
Dil Raju
V
Vakil Saab
Corona Virus
Effect

More Telugu News