Charan: చరణ్ పాత్రలపై పెయింటింగ్ పోటీలకు గడువు పొడిగింపు

Ramcharan
  • చరణ్ పాత్రలపై చిత్రకళా పోటీలు 
  • చిత్రకారులను ప్రోత్సహించే కార్యక్రమం 
  • ఉత్తమ పెయింటింగుకు చిరు సత్కారం
తెలుగులో స్టార్ హీరోగా చరణ్ దూసుకుపోతున్నాడు. విభిన్నమైన కథాకథనాలు .. విలక్షణమైన పాత్రలను ఎంచుకుంటూ వెళుతూ తన ప్రత్యేకతను చాటుకుంటున్నాడు. చరణ్ తన ప్రతి సినిమాలోను తన లుక్ కి సంబంధించిన విషయంలో ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటాడు. అందువలన ఆయన పాత్రల వేషధారణ ఆ సినిమాలకి ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తూ ఉంటుంది. అందువలన ఆయన పాత్రలకి సంబంధించిన చిత్రకళా పోటీలను అఖిల భారత చిరంజీవి యువత నిర్వహిస్తోంది.

చిత్రకారులలో వున్న నైపుణ్యాన్ని ప్రోత్సహించాలని మరియు అభిమానుల్లో అంతర్గతంగా వున్న కళాశక్తిని వెలికితీసేందుకు ఈ చిత్రకళా పోటీలను తలపెట్టారు. ఆసక్తి కలిగిన చిత్రకారులు చరణ్ పాత్రలపై తాము గీసిన చిత్రాలను ఆయన పుట్టినరోజు నాటికి పంపించమని ముందుగా ప్రకటించారు. ఇప్పుడు ఆ గడువును ఏప్రిల్ 18నాటికి పొడిగించారు. అభిమానులు గీసిన చిత్రాలను [email protected]కు పంపించవలసిందిగా కోరారు. ఉత్తమ పెయింటింగుకు చిరు సత్కారం ఉంటుందని తెలియజేశారు.
Charan
Akhila Bharatha Chiranjeevi Yuvatha
Tollywood

More Telugu News