Cricket: స్వయంగా గుండు చేసుకుని కోహ్లీని కూడా గుండు చేసుకోమని సవాలు విసిరిన క్రికెటర్.. వీడియో వైరల్

Warner shaves off head to show support towards medical staff
  • ఇలా చేసి కరోనాపై పోరాడుతున్న వారికి మద్దతు తెలపాలన్న క్రికెటర్
  • ఆస్ట్రేలియా క్రికెటర్ స్టీవ్ స్మిత్‌కు కూడా సవాలు
  • ఇన్‌స్టాగ్రామ్‌లో వీడియో పోస్ట్
ఆస్ట్రేలియా క్రికెటర్ డేవిడ్ వార్నర్ స్వయంగా గుండు చేసుకున్నాడు. తనలాగే గుండు చేసుకోవాలని టీమిండియా సారథి విరాట్ కోహ్లీతో పాటు ఆస్ట్రేలియా క్రికెటర్ స్టీవ్ స్మిత్ కు సవాలు విసిరాడు. కరోనా వైరస్ ను ఎదుర్కునేందుకు అవగాహన కల్పించడంలో భాగంగా ఆయన ఇటువంటి ఛాలెంజ్ విసిరాడు. వైద్య సిబ్బందికి మద్దతు తెలుపుతూ ఇలా షేవ్ చేసుకున్నానని చెప్పాడు.

ఇంట్లో గుండు చేసుకుంటూ తీసుకున్న వీడియోను తన ఇన్‌స్టాగ్రామ్‌ ఖాతాలో పోస్ట్ చేశాడు. కరోనా విజృంభణ నేపథ్యంలో సేవలు అందిస్తోన్న వారికి తన మద్దతు తెలుపుతున్నానని ఆయన పేర్కొన్నాడు. ఇలా గుండు చేసుకుంటూ వారికి మద్దతు తెలపాలని కోరాడు. కాగా, ఆస్ట్రేలియాలో కరోనా మృతుల సంఖ్య 19కి చేరింది. ఆ దేశంలో ఈ రోజు ఉదయం 8 గంటల నాటికి 4,460 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి.
Cricket
Virat Kohli
Corona Virus

More Telugu News