Hardik Pandya: 'హార్దిక్ పాండ్యా మంచి సింగర్' అంటున్న చాహల్

 Hardik Pandya is a good singer in the team says Yuzvendra Chahal
  • జట్టులో అతను మంచి సింగర్ 
  • వెల్లడించిన లెగ్ స్పిన్నర్ యుజ్వేంద్ర చాహల్
  • రైనా, మోహిత్‌ శర్మ కూడా బాగా పాడుతారని కితాబు
కరోనా వైరస్ ప్రభావంతో అనుకోకుండా వచ్చిన విరామంలో  టీమిండియా క్రికెటర్లు ఇళ్లకే పరిమితమయ్యారు. సోషల్ మీడియా వేదికగా కొంత మంది క్రీడాకారులు ప్రజలకు సందేశాలు పంపిస్తున్నారు. ఈ క్రమంలో టీమిండియా లెగ్ స్పిన్నర్ చాహల్.. సింగర్ రాహుల్ వైద్యతో ఇన్‌స్టాగ్రామ్‌  లైవ్ వీడియోలో పాల్గొన్నాడు. ఈ సందర్భంగా యువ ఆల్‌రౌండర్ హార్దిక్‌ పాండ్యా గురించి ఆసక్తికర విషయం బయట పెట్టాడు.

ధనాధన్‌ బ్యాటింగ్, అద్భుతమైన బౌలింగ్, మెరుపులాంటి ఫీల్డింగ్‌తోనే కాకుండా విభిన్నమైన డ్రెస్‌, హెయిర్ స్టయిల్‌తో అభిమానులను ఆకట్టుకునే హార్దిక్‌లో మరో కళ కూడా ఉందని చెప్పాడు. బ్యాటింగ్, బౌలింగే కాదు అతను పాటలు కూడా పాడుతాడని తెలిపాడు. ప్రస్తుత భారత జట్టులో  హార్దిక్ పాండ్యా మంచి సింగర్ అని చాహల్ అన్నాడు.

‘జట్టులో చాలా మంది  సింగర్స్ ఉన్నారు. సురేశ్ రైనా, మోహిత్ శర్మ బాగా పాడతారు. అయితే హార్దిక్ తక్కువేం కాదు. అతను కూడా  బాగా పాడతాడు’ అని చెప్పుకొచ్చాడు. ఇక, కరోనా వైరస్ గురించి ఇప్పటికే చాలా చర్చించామన్న చాహల్.. ఇప్పుడు మ్యూజిక్ విని దాని గురించి ఎందుకు మాట్లాడుకోకూడదని అన్నాడు.

రోహిత్ శర్మతో జరిగిన మరో ఇన్‌స్టాగ్రామ్‌ లైవ్‌ సెషన్‌లో కూడా చాహల్ పాల్గొన్నాడు. ‘బాగానే బౌలింగ్ చేస్తున్నా. అయితే విన్నింగ్ స్పెల్ వేసి చాలా కాలమైంది. రెండు, మూడు వికెట్లు పడగొడుతున్నా.. విన్నింగ్ స్పెల్ వేయలేకపోతున్నా‘ అని చెప్పుకొచ్చాడు.
Hardik Pandya
good singer
Team India
chahal

More Telugu News