Vijay Mallya: సాయం చేయండంటూ కేంద్ర ప్రభుత్వాన్ని అభ్యర్థించిన విజయ్ మాల్యా

Paying My Employees Despite Lockdown says Vijay Mallya Seeks Centres Help
  • లాక్ డౌన్ కారణంగా నా కంపెనీల కార్యకలాపాలు ఆగిపోయాయి
  • ఉద్యోగులను ఇంటికి పంపలేకపోతున్నాం
  • తగిన వేతనాలను కూడా చెల్లించలేకపోతున్నాం
బ్యాంకులను మోసం చేసి లండన్ కు చెక్కేసిన లిక్కర్ బ్యారన్ విజయ్ మాల్యా... ఇండియా లాక్ డౌన్ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వానికి ట్విట్టర్ ద్వారా ఓ విన్నపం చేశారు. 'కరోనా నేపథ్యంలో ఊహించని విధంగా యావత్ దేశాన్ని భారత ప్రభుత్వం లాక్ డౌన్ చేసింది. ప్రభుత్వ నిర్ణయాన్ని గౌరవిస్తున్నాం. లాక్ డౌన్ కారణంగా నా కంపెనీల కార్యకలాపాలన్నీ నిలిచిపోయాయి. ఉత్పాదన ఆగిపోయింది. మా సంస్థల్లో పని చేస్తున్నవారిని ఇంటికి పంపలేకపోతున్నాం. వారికి తగిన వేతనాలు కూడా చెల్లించలేకపోతున్నాం. ప్రభుత్వం సహకరించాలి' అని ట్వీట్ చేశారు. తమ ఉద్యోగులను ఇంటికి పంపించడానికి సహకరించాలని చెప్పారు.

కింగ్ ఫిషర్ ఎయిర్ లైన్స్ కోసం బ్యాంకుల నుంచి తీసుకున్న రుణాలను చెల్లిస్తానంటూ ఇప్పటికే పలుమార్లు ఆఫర్ చేశానని... తన నుంచి డబ్బు తీసుకోవడానికి బ్యాంకులు ముందుకు రాలేదని... ఇదే  సమయంలో అటాచ్ చేసిన తన ఆస్తులను రిలీజ్ చేయడానికి ఈడీ కూడా ముందుకు రాలేదని విజయ్ మాల్యా అసహనం వ్యక్తం చేశారు. ఈ క్లిష్ట సమయంలో తన మాటలను కేంద్ర ఆర్థిక మంత్రి వింటారని ఆశిస్తున్నానని చెప్పారు.
Vijay Mallya
ED
Lockdown

More Telugu News