vistara: గోవా ప్రయాణికుడికి కరోనా పాజిటివ్..సెల్ఫ్ క్వారంటైన్‌లోకి ‘విస్తారా’ సిబ్బంది

  • 22న ముంబై నుంచి గోవా వచ్చిన వ్యక్తికి సోకిన వైరస్
  • గతంలో అతను న్యూయార్క్‌ వెళ్లొచ్చినట్టు గుర్తింపు
  • తోటి ప్రయాణికులను కూడా అప్రమత్తం చేసిన గోవా ప్రభుత్వం
Vistara asks staff to self quarantine as Goan passenger tests positive

తమ విమానంలో ప్రయాణించిన ఓ వ్యక్తికి కరోనా వైరస్ సోకినట్టు తేలడంతో ‘విస్తారా’ విమాన సంస్థ అప్రమత్తమైంది. తమ సిబ్బందిని సెల్ఫ్ క్వారంటైన్‌కు పంపించింది. ఈ నెల 22వ తేదీన  విస్తారా విమానంలో ముంబై నుంచి గోవా వచ్చిన ఓ ప్రయాణికుడికి  కరోనా పాజిటివ్ వచ్చినట్టు నిన్న గోవా ప్రభుత్వం తెలిపింది. ఆ వ్యక్తి ఇటీవల న్యూయార్క్ వెళ్లొచ్చినట్టు గుర్తించారు.

విస్తారాకు చెందిన యూకే 861 నంబరు విమానంలో అతను ముంబై నుంచి తమ రాష్ట్రానికి వచ్చినట్టు తేలడంతో ప్రభుత్వం సదరు విమానయాన సంస్థను అప్రమత్తం చేసింది. వెంటనే స్పందించిన విస్తారా.. ఆ విమానం నడిపిన పైలట్, కో పైలట్లు, ఇతర సిబ్బందిని సెల్ఫ్ క్వారంటైన్‌లోకి వెళ్లాలని ఆదేశించింది. అలాగే, ఆ విమానంలో ప్రయాణించిన ప్రయాణికులు కూడా వెంటనే సెల్ఫ్ క్వారంటైన్‌లోకి వెళ్లాలని గోవా ప్రభుత్వం సూచించింది. ప్రయాణికులంతా వెంటనే హెల్ప్ లైన్ నంబరుకు ఫోన్‌ చేయాలని, లేదంటే సమీపంలోని ఆరోగ్య కేంద్రాన్ని సంప్రదించాలని స్పష్టం చేసింది.

More Telugu News