Smart city: కరోనా వైరస్ వ్యాప్తి నిరోధక చర్యల్లో తిరుపతికి అగ్రస్థానం!

  • స్మార్ట్‌మిషన్ ర్యాంకుల్లో తిరుపతికి అగ్రస్థానం
  • వైరస్ అడ్డుకట్టకు చేపట్టిన చర్యలు ప్రశంసనీయం
  • విదేశాల నుంచి వచ్చిన వారిని పక్కాగా క్వారంటైన్ చేశారని కితాబు
Tirupati got first in Smart mission Ranks

కరోనా వైరస్ వ్యాప్తిని అడ్డుకోవడంలో ఏపీలోని స్మార్ట్‌సిటీలైన విశాఖపట్టణం, అమరావతి, కాకినాడతో పోలిస్తే తిరుపతి అగ్రస్థానంలో నిలిచింది. ఈ మేరకు స్మార్ట్‌మిషన్ ప్రకటించిన ర్యాంకుల్లో అగ్రస్థానాన్ని సొంతం చేసుకుంది. వైరస్ వ్యాప్తి నిరోధక చర్యలు ఇక్కడ భేషుగ్గా ఉన్నాయని స్మార్ట్‌మిషన్ తన నివేదికలో పేర్కొంది.

వైరస్ వ్యాప్తిని అరికట్టడంలో స్మార్ట్‌నగరాల పనితీరును స్మార్ట్‌సిటీ మిషన్ మూడు గ్రేడ్‌లుగా విభజించి పరిశీలించింది. విదేశాల నుంచి వచ్చిన వారి ఇళ్ల వద్ద పక్కాగా మార్కింగ్ చేయడం, వారిని క్వారంటైన్ చేయడంలో తిరుపతి అధికారులు అద్భుతంగా పనిచేశారని ప్రశంసించింది. లాక్‌డౌన్ నేపథ్యంలో ఇళ్ల వద్దకే వెళ్లి నిత్యావసర సరుకులు అందిస్తున్నారని స్మార్ట్‌మిషన్ తెలిపింది.

More Telugu News