Telangana: తెలంగాణలో కరోనా మహమ్మారికి మరొకరి బలి

Another corona death in Telangana state as dearth toll reaches two
  • రాష్ట్రంలో రెండుకు చేరిన మరణాలు
  • పాజిటివ్ కేసుల సంఖ్య 76
  • ఇవాళ కొత్తగా 6 కేసుల నమోదు
తెలంగాణలో కరోనా వైరస్ మరొకరిని బలి తీసుకుంది. ఇవాళ కొత్తగా 6 కేసులు నమోదు కాగా, ఓ మరణం చోటుచేసుకుంది. దాంతో తెలంగాణలో కరోనా మరణాల సంఖ్య 2కి చేరింది. మూడ్రోజుల కిందట తెలంగాణలో తొలి కరోనా మరణం సంభవించగా, ఆ విషయం నిన్న వెల్లడించిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం తెలంగాణలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 76 అని ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి. ఈ మేరకు కరోనా పరిస్థితిపై రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ బులెటిన్ విడుదల చేసింది. గాంధీ ఆసుపత్రిలో కరోనా చికిత్స పొందిన 13 మంది కోలుకుని డిశ్చార్జి అయ్యారని బులెటిన్ లో తెలిపారు.
Telangana
Corona Virus
Death
Positive
Bulletin

More Telugu News