Nara Lokesh: రేషన్ ఇంటికే అందించాలని ఏపీ ప్రభుత్వాన్ని కోరుతున్నా: నారా లోకేశ్

Nara Lokesh suggestion to AP Government
  • ‘కరోనా’ విజృంభిస్తోంది.. ప్రజలను రేషన్ కోసం రోడ్లపై నిలబెట్టొద్దు
  • అలా నిలబెట్టడం అంత శ్రేయస్కరం కాదు
  • రేషన్ కోసం ఎండలో నిలబడ్డ వృద్ధురాలు మృతి బాధాకరం 
కరోనా వైరస్ విజృంభిస్తున్న నేపథ్యంలో ప్రజలను రేషన్ కోసం రోడ్లపై నిలబెట్టడం అంత శ్రేయస్కరం కాదంటూ ఏపీ ప్రభుత్వానికి టీడీపీ నేత నారా లోకేశ్ సూచించారు. ఈ సందర్భంగా విశాఖలోని ద్వారకా నగర్ లో వృద్ధురాలు షేక్ మేరబీ మృతి చెందిన ఘటన గురించి ప్రస్తావించారు. ఈ ఘటన తనను తీవ్రంగా కలచివేసిందని అన్నారు. నెలకు రూ.400 కోట్ల ప్రజాధనంతో నడుస్తున్న వాలంటీర్ వ్యవస్థ ద్వారా ఇంటికే రేషన్ అందించాలని ప్రభుత్వాన్ని కోరుతున్నానంటూ లోకేశ్ వరుస ట్వీట్లు చేశారు.
Nara Lokesh
Telugudesam
Ration
Andhra Pradesh
Government

More Telugu News