CCMB: కేసీఆర్ విజ్ఞప్తికి కేంద్రం స్పందన.. సీసీఎంబీలో ‘కరోనా’ నిర్ధారణ పరీక్షలకు అనుమతి!

  • సీసీఎంబీలో ‘కరోనా’ నిర్ధారణ పరీక్షలకు అనుమతించాలని ఇటీవల కోరిన కేసీఆర్
  • ఈ మేరకు అనుమతిస్తూ సీసీఎంబీకి ఆదేశాలు జారీ
  • రేపటి నుంచి  సీసీఎంబీలో  ‘కరోనా’ నిర్ధారణ పరీక్షలు
Central Government accepts to conduct corona tests in CCMB

హైదరాబాద్ లోని సెంటర్ ఫర్ సెల్యులార్ అండ్ మాలిక్యులర్ బయాలజీ (సీసీఎంబీ)లో కరోనా వైరస్ నిర్ధారణ పరీక్షలకు అనుమతించాలన్న తెలంగాణ సీఎం కేసీఆర్ విజ్ఞప్తికి కేంద్ర ప్రభుత్వం స్పందించింది. ఈ మేరకు అనుమతినిస్తూ సీసీఎంబీకి ఆదేశాలు జారీ చేసింది. ఈ ఆదేశాల నేపథ్యంలో రేపటి నుంచి ‘కరోనా’ నిర్ధారణ పరీక్షలు సీసీఎంబీలో కూడా నిర్వహించనున్నారు. గాంధీ ఆసుపత్రి నుంచి సీసీఎంబీకి శాంపిల్స్ పంపేందుకు ఏర్పాట్లు ప్రారంభించినట్టు సమాచారం.

కాగా, వివిధ రాష్ట్రాల ముఖ్యమంత్రులతో ప్రధాని మోదీ ఇటీవలే వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా, సీసీఎంబీలో కరోనా నిర్ధారణ పరీక్షలకు అనుమతించాలని, ఇక్కడైతే ఒకేసారి 800 నుంచి 1000 వరకు నమూనాలను పరీక్షించే అవకాశం ఉంటుందన్న విషయాన్ని మోదీ దృష్టికి కేసీఆర్ తీసుకెళ్లారు.

More Telugu News