Surya: 'అరువా' సినిమాలో సూర్య జోడీగా పూజ హెగ్డే

Aruva Movie
  • సూర్య తాజా చిత్రంగా 'అరువా'
  • యాక్షన్, ఎమోషన్ ప్రధాన నేపథ్యం 
  • దర్శకుడిగా హరి 
జయాపజయాల సంగతి అటుంచితే, సూర్య వరుస సినిమాలు చేసుకుంటూ వెళుతున్నాడు. అలా ప్రస్తుతం ఆయన 'అరువా' చిత్రంలో నటిస్తున్నాడు. యాక్షన్ సినిమాలకి పెట్టింది పేరైన హరి, ఈ సినిమాకి దర్శకుడిగా వ్యవహరిస్తున్నాడు. ఈ సినిమాలో కథానాయిక పాత్ర కోసం కొంతమంది పేర్లను పరిశీలించారు. చివరికి పూజ హెగ్డేను తీసుకున్నట్టుగా తెలుస్తోంది.

దాదాపు ఆమె ఎంపిక ఖరారైపోయిందనే అంటున్నారు. ఇప్పటికే పూజ హెగ్డే తెలుగులో తన జోరును కొనసాగిస్తోంది. త్వరలోనే రానున్న అఖిల్ సినిమా .. ప్రభాస్ సినిమాలు ఆమె క్రేజ్ ను మరింత పెంచుతాయనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఇప్పుడేమో తమిళంలో సూర్య సరసనే ఛాన్స్ కొట్టేసింది. ఇక కోలీవుడ్లోను పూజ హవా కొనసాగుతుందేమో చూడాలి.
Surya
Pooja Hegde
Hari Movie

More Telugu News