Corona Virus: తూ.గో. జిల్లాలో 33 మంది, అనంతపురం జిల్లాలో ఐదుగురు కరోనా అనుమానితులు

Corona suspected people in East Godavari and Anantapur Districts
  • ఏపీలో విస్తరిస్తున్న కరోనా
  • రాజమండ్రి ఐసొలేషన్ కు 24 మంది తరలింపు
  • కాకినాడ జీజీహెచ్  కు 9 మంది తరలింపు
ఏపీలో కరోనా వైరస్ నెమ్మదిగా విస్తరిస్తోంది. కరోనా అనుమానాలతో రాజమండ్రి ప్రభుత్వ ఆసుపత్రిలో ఏర్పాటు చేసిన ఐసొలేషన్ కు 24 మందిని తరలించారు. మరో 9 మందిని కాకినాడ జీజీహెచ్ ఐసొలేషన్ కు తరలించారు. మరోవైపు, అనంతపురం జిల్లాలో కూడా కరోనా కల్లోలం మొదలైంది. ఉరవకొండ, వజ్రకరూరుకు చెందిన ఐదుగురిని ఐసొలేషన్ కు తరలించి చికిత్స అందిస్తున్నారు. మరోవైపు భారత్ లో మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 1,024కు చేరుకుంది. మృతుల సంఖ్య 28కి చేరింది. 
Corona Virus
Andhra Pradesh
Rajahmundry
Anantapur District
Kakinada

More Telugu News