India: దేశంలో కొత్తగా మరో 130 మందికి కరోనా!

  • ఆదివారం  దేశవ్యాప్తంగా నమోదు
  • ఒక రోజులో ఇదే అత్యధికం
  • 1100 దాటిన కేసుల సంఖ్య
 130 new corona cases in india highest in a single day

భారత్‌లో కరోనా వైరస్ పాజిటివ్ కేసుల సంఖ్య 1100 దాటింది. ఆదివారం మరో 130 మందికి ఈ వైరస్ సోకినట్టు నిర్ధారించారు. ఇప్పటిదాకా ఒకే రోజు నమోదైన అత్యధిక కేసులు ఇవే. దేశ రాజధాని ఢిల్లీలో అత్యధికంగా 23 కొత్త కేసులు రావడం గమనార్హం. ఢిల్లీలో ఒకే రోజు పదికంటే ఎక్కువ మందికి వైరస్ సోకడం ఇదే మొదటి సారి. దీనిపై ఆ రాష్ట్ర ప్రభుత్వం ఆందోళన వ్యక్తం చేస్తోంది.

దేశ వ్యాప్తంగా చూస్తే ఆదివారంతో కలిపి వరుసగా మూడు రోజులు వంద కంటే ఎక్కువ కొత్త కేసులు వచ్చాయి. అన్ని రాష్ట్రాల సమాచారం మేరకు ఇప్పటిదాకా 1,122 మందికి వైరస్‌ సోకినట్టు తేలింది. అందులో 30 మంది చనిపోయారు. 118 మంది కోలుకున్నారు. అయితే, కేంద్ర ఆరోగ్య శాఖ మాత్రం 1024 పాజిటివ్ కేసులు ఉన్నాయని, 27 మంది చనిపోయారని ధ్రువీకరించింది.

మహారాష్ట్రలో అత్యధికంగా 203 మందికి వైరస్‌ సోకగా, ఆదివారం ఇద్దరు చనిపోయారు. దాంతో  ఆ రాష్ట్రంలో కరోనా మృతుల సంఖ్య ఎనిమిదికి పెరిగింది. పశ్చిమ ముంబైకి చెందిన ఓ ట్యాక్సీ డ్రైవర్ భార్య, బుల్దానాకు చెందిన మరో వ్యక్తికి వైరస్ సోకింది. 40 ఏళ్లకు పైబడిన ఈ ఇద్దరూ విదేశాలకు ప్రయాణాలు చేయలేదని అధికారులు గుర్తించారు. దాంతో, ఈ ప్రాణాంతక వైరస్ వ్యాప్తిపై అధికారులు ఆందోళన చెందుతున్నారు. మహారాష్ట్రలో తొలి వంద కేసులు 16 రోజుల్లో రాగా.. గత ఐదు రోజుల్లోనే మరో వంద మందికి పాజిటివ్ తేలింది.

More Telugu News