మాంసం కూర వండలేదని కొట్టి చంపాడు!
- తూర్పుగోదావరి జిల్లా జగ్గంపేట మండలంలో ఘటన
- పూటుగా తాగొచ్చి గొడవ పడిన నిందితుడు
- హతురాలి కుమారుడి ఫిర్యాదుతో కేసు
శనివారం రాత్రి మద్యం మత్తులో వచ్చిన వెంకటేశ్.. మాంసం కూర ఎందుకు వండలేదని లక్ష్మితో గొడవ పెట్టుకున్నాడు. ఈ క్రమంలో ఇద్దరి మధ్య మాటామాట పెరగడంతో వెంకటేశ్ ఆగ్రహంతో ఊగిపోయాడు. పక్కనే ఉన్న కర్ర తీసుకుని లక్ష్మిపై దాడిచేశాడు. తీవ్ర గాయాల పాలైన లక్ష్మి నిన్న ఉదయం మృతి చెందింది. ఆమె కుమారుడి ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.