Rajamouli: చిన్ననాటి ఆ ఆలోచనతోనే ఇప్పుడీ 'ఆర్ఆర్ఆర్'... ఆసక్తికర విషయం చెప్పిన రాజమౌళి!

Rajamouli Shares Interesting Things about RRR
  • లాక్ డౌన్ కారణంగా నిలిచిన షూటింగ్
  • చిన్న వయసులో సూపర్ మేన్, స్పైడర్ మేన్ పుస్తకాలు చదివా
  • ఇద్దరు సూపర్ హీరోలు కలిస్తే ఎలా ఉంటుందన్న ఆలోచనతోనే ఈ సినిమా
ఎన్టీఆర్, రామ్ చరణ్ హీరోలుగా, ఆలియాభట్, ఒలివియా మోరిస్ హీరోయిన్లుగా రాజమౌళి తెరకెక్కిస్తున్న రౌద్రం రణం రుధిరం (ఆర్ఆర్ఆర్) మోషన్ పోస్టర్, రామ్ చరణ్ ఫస్ట్ లుక్ టీజర్ ఇప్పటికే విడుదలై నెట్టింట టాప్ ట్రెండింగ్ లో నిలిచిన వేళ, బాలీవుడ్ మీడియాకు రాజమౌళి ఇంటర్వ్యూ ఇచ్చారు.

లాక్ డౌన్ కారణంగా ప్రస్తుతానికి సినిమా షూటింగ్ ను నిలిపివేశామని తెలిపిన ఆయన, మోషన్ పోస్టర్‌కు అద్భుతమైన స్పందన రావడం తనకెంతో ఆనందాన్ని కలిగించిందన్నారు. ఈ సినిమాలో స్టార్ హీరోలు ఇద్దరు ఉన్నారని, వాళ్లకు అభిమానుల సంఖ్య చాలా ఎక్కువని గుర్తు చేశారు. వారిద్దరూ నిజ జీవితంలో చాలా మంచి మిత్రులని, అందువల్ల షూటింగ్ సమయంలో తనకు ఎటువంటి ఇబ్బందులూ ఎదురు కాలేదని అన్నారు.

చిన్న వయసులో తాను సూపర్‌ మేన్, స్పైడర్‌ మేన్ తదితర కామిక్ పుస్తకాలు తెగ చదివానని వెల్లడించిన రాజమౌళి, వాళ్లిద్దరు కలిసి పోరాడితే బాగుంటుందని అనిపించేదని తెలిపారు. ఆ నాడు తన మనసులో నాటుకుపోయిన ఆలోచనేతోనే ఇప్పుడు 'ఆర్ఆర్ఆర్' చిత్రాన్ని చేస్తున్నట్టుగా తెలిపారు. ఈ సినిమాకు ఇప్పటివరకూ అన్నీ కలిసి వచ్చాయని అభిప్రాయపడ్డారు.
Rajamouli
Junior NTR
Ramcharan
RRR

More Telugu News