China: కరోనా వైరస్ జిత్తులమారి... నెగటివ్ వచ్చినా, శరీరంలోనే తిష్ట!

  • చైనాలో పరిశోధనలు చేసిన డాక్టర్ లోకేశ్ శర్మ
  • సగం మంది శరీరం నుంచి తొలగని వైరస్
  • చికిత్స తరువాత క్వారంటైన్ లోనే ఉండాలని సూచన
Patients having virus After Corona Negative also

కరోనా మహమ్మారికి చికిత్స పొందిన వారి రక్త నమూనాల్లో నెగటివ్ వచ్చినప్పటికీ, ఆపై మరో ఎనిమిది రోజుల పాటు వైరస్ శరీరంలోనే తిష్ట వేసుకుని కూర్చుంటోందని, ఇది ఓ జిత్తుల మారి వంటిదని శాస్త్రవేత్తలు తేల్చారు. 'అమెరికన్‌ జర్నల్‌ ఆఫ్‌ రెస్పిరేటరీ అండ్‌ క్రిటికల్‌ కేర్‌ మెడిసిన్‌' తాజా సంచికలో ప్రచురితమైన వివరాలను బట్టి, వ్యాధి బారిన పడి, చికిత్స పొందాక, ఆ లక్షణాలు కనిపించక పోయినా, ఆపై మరో ఎనిమిది రోజుల పాటు వైరస్‌ వారి శరీరంలోనే దాగుందని గుర్తించినట్టు భారతీయ సంతతి శాస్త్రవేత్త లోకేశ్‌ శర్మ తెలిపారు. చైనాలో కరోనా రోగులపై ఆయన ఓ పరిశోధన చేసి, దాని వివరాలను ప్రకటించారు.

బీజింగ్‌ లోని పీఎల్‌ఏ జనరల్‌ హాస్పిటల్ లో జనవరి 28 నుంచి ఫిబ్రవరి 9 మధ్య వ్యాధికి చికిత్స పొందిన 16 మందిపై పరిశోధనలు చేశామని వెల్లడించిన లోకేశ్‌ శర్మ, వీరి నుంచి రోజు విడిచి రోజు రక్త నమూనాలు సేకరించామని, చికిత్స తరువాత వైరస్‌ లేదని నిర్ధారణ అయిన వారిలో సగం మందిలో మరో ఎనిమిది రోజులపాటు వైరస్‌ దాగుందని తెలిపారు. చికిత్స పొందిన వారు మరికొన్ని రోజులు క్వారంటైన్ లో ఉంటేనే మంచిదని సూచించారు.

More Telugu News