Kerala: ఇక మాస్క్ లను విక్రయించబోము: కేరళ మెడికల్ షాపుల నిర్ణయం

  • ధరలను నిర్ణయించిన కేంద్రం
  • అధిక ధరలకు అమ్మితే కేసులు
  • కేంద్రం ధరలకు విక్రయించలేమంటున్న మెడికల్ షాపులు
Kerala Medicle Shops Dicede to stop Mask Sell

కరోనా వైరస్ తమకు సోకకుండా చూసుకునేందుకు ప్రజలంతా మాస్క్ లు, శానిటైజర్ల కొనుగోలుకు ఎగబడుతున్న వేళ, కేరళలోని పలు మెడికల్ షాపుల్లో మాస్క్‌ ల విక్రయాలను నిలిపివేశారు. మాస్క్ లు, శానిటైజర్లకు ధరలు నిర్ణయించిన కేంద్రం, నిర్ణీత ధరల కంటే అధికంగా విక్రయిస్తే కేసులు పెడతామని, నిత్యావసర వస్తువుల చట్టం ప్రకారం షాపుల యజమానులపై కఠిన చర్యలు తీసుకుంటామని కేంద్రం హెచ్చరించడమే దీనికి కారణమట!

కేంద్రం నిర్ణయించిన ధరలకు మాస్క్ లను విక్రయించలేమని మెడికల్ షాపు యాజమానులు అంటున్నారు. దీంతో ప్రజల అవస్థలు ఒక్కసారిగా పెరిగాయి. కేరళలోని తిరువనంతపురం సహా పలు ఇతర ప్రాంతాల్లోని ఔషధ దుకాణాల్లో మాస్క్ ల విక్రయాలను నిలిపివేయడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.

More Telugu News