India abroad: అమెరికాలో ఐదు దశాబ్దాల చరిత్ర కలిగిన భారతీయ పత్రిక మూసివేత!

  • ‘ఇండియా అబ్రాడ్’ పేరుతో వస్తున్న పత్రిక
  • 1970లో స్థాపించిన గోపాల్ రాజ్
  • ఆ తర్వాత చేతులు మారిన వైనం
Indian news paper print edition closed in Amrica

ఓ వైపు కరోనా కల్లోలం, మరోవైపు ప్రకటనలు లేకపోవడంతో అమెరికాలో 5 దశాబ్దాల చరిత్ర కలిగిన భారతీయ పత్రిక ప్రింట్ ఎడిషన్ మూతపడింది. ప్రవాస భారతీయుడైన గోపాల్ రాజ్ 1970లో ‘ఇండియా అబ్రాడ్’ పేరుతో పత్రికను స్థాపించారు. అమెరికాలోని భారతీయుల మన్ననలు అందుకున్న ఈ పత్రిక రాజకీయం, సాంకేతికత, సాహిత్యం వంటి రంగాల్లో విస్తృతంగా వార్తలు అందిస్తోంది.

2011లో రిడిఫ్ డాట్ కామ్ ఈ పత్రికను కొనుగోలు చేయగా, 2016లో ‘8కే మైల్స్ మీడియా ఇంక్’ ఈ పత్రికపై యాజమాన్య హక్కులను సొంతం చేసుకుంది. తాజాగా, కరోనా వైరస్ అమెరికాను భయపెడుతుండడంతోపాటు ప్రకటనలు లేకపోవడంతో నిర్వహణ ఖర్చు భారమైంది. దీంతో ప్రింట్ ఎడిషన్‌ను మూసివేస్తున్నట్టు ప్రకటించిన యాజమాన్యం.. వెబ్ ఎడిషన్ మాత్రం కొనసాగుతుందని స్పష్టం చేసింది.

More Telugu News