Ambati Rambabu: అసలు విందే జరగలేదు, ఇక నేను ఎలా వెళ్తాను?: అంబటి రాంబాబు

Ambati Rambabu explanation about Mla mustfa banquet
  • గుంటూరు ఎమ్మెల్యే ముస్తఫా విందుకు అంబటి వెళ్లారని ప్రచారం 
  • ఖండిస్తున్నా.. ఇది రాజకీయాలు చేయాల్సిన సమయం కాదు
  • క్వారంటైన్ కు వెళ్లాలంటూ ట్రోల్ చేయడం తగదు
గుంటూరు ఎమ్మెల్యే ముస్తఫా విందు ఏర్పాటు చేశారన్న ప్రచారంపై, ఆ విందుకు తాను హాజరయ్యానన్న మరో ప్రచారంపై అంబటి రాంబాబు స్పందించారు. ఈరోజు ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ, అసలు విందే జరగలేదని, ఇక జరగని విందుకు తాను ఎలా వెళ్తానని ప్రశ్నించారు. తమ ఎమ్మెల్యేలు ఆళ్ల రామకృష్ణారెడ్డి, ఉండవల్లి శ్రీదేవిలపై కూడా జరుగుతున్న దుష్ప్రచారాన్నీ ఖండిస్తున్నట్టు చెప్పారు. రాజకీయ ప్రత్యర్థులు తమపై ఇలా దుష్ప్రచారం చేయడం తగదని, ఇది రాజకీయాలు చేయాల్సిన సమయం కాదని హితవు పలికారు. తాము క్వారంటైన్ కు వెళ్లాలంటూ ట్రోల్ చేస్తున్న దానిపైనా ఆయన విమర్శలు గుప్పించారు.
Ambati Rambabu
YSRCP
guntur
mla
mustafa

More Telugu News