Payyavula Keshav: కరోనా నేపథ్యంలో సీఎం జగన్ కు లేఖ రాసిన పయ్యావుల కేశవ్

Payyavula Keshav writes CM Jagan
  • పోలీసులు, పారిశుద్ధ్య, మీడియా సిబ్బందికి బీమా కల్పించాలని విజ్ఞప్తి
  • వైరస్ వ్యాప్తి చెందకుండా సేవలందిస్తున్నారని వెల్లడి
  • ఒక్కొక్కరికి రూ.50 లక్షల బీమా ఇవ్వాలని సూచన
కరోనా లాక్ డౌన్ నేపథ్యంలో టీడీపీ సీనియర్ నేత పయ్యావుల కేశవ్ ఏపీ సీఎం జగన్ కు లేఖ రాశారు. పోలీసు, పారిశుద్ధ్య, మీడియా సిబ్బందికి బీమా సౌకర్యం కల్పించాలని విజ్ఞప్తి చేశారు. పోలీసులు, పారిశుద్ధ్య సిబ్బంది, మీడియా ప్రతినిధులు కరోనా వైరస్ వ్యాప్తి చెందకుండా సేవలు అందిస్తున్నారని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం ఒక్కొక్కరికి రూ.50 లక్షల బీమా కల్పించాలని కోరారు. కాగా, ఏపీలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 19కి చేరుకోగా, ఒక వ్యక్తి కోలుకున్నారు. గుంటూరు జిల్లాలో 4, విశాఖ జిల్లాలో 4, కృష్ణా జిల్లాల్లో 4, ప్రకాశం జిల్లాలో 3, చిత్తూరు జిల్లాలో 1, నెల్లూరు జిల్లాలో 1, తూర్పు గోదావరి జిల్లాలో 1, కర్నూలు జిల్లాలో 1 కేసు నమోదయ్యాయి.​
Payyavula Keshav
Jagan
Corona Virus
Insurence
Police
Sanitary Labour
Media

More Telugu News