Somireddy Chandra Mohan Reddy: కేసీఆర్ రాజకీయ ప్రత్యర్థి అయినా ఈ రెండు మాటలు చెప్పక తప్పడంలేదు: సోమిరెడ్డి

TDP leader Somireddy makes interesting comments
  • ఇగోయిస్టులకు కేసీఆర్ తీరు కనువిప్పుకావాలంటూ వ్యాఖ్యలు
  • కేసీఆర్ పట్టువిడుపుల ధోరణి ప్రదర్శిస్తుంటారని వెల్లడి
  • కేసీఆర్ ను చూసి నాయకులు నేర్చుకోవాలంటూ హితవు
కరోనా లాక్ డౌన్ నేపథ్యంలో టీడీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ సీఎం కేసీఆర్ తమకు రాజకీయ ప్రత్యర్థి అయినా, ఆయన గురించి రెండు మాటలు చెప్పక తప్పడంలేదని అన్నారు. సీఎం కేసీఆర్ ఓ నిర్ణయం తీసుకుంటే పరిస్థితులకు అనుగుణంగా మార్పులు చేర్పులు చేస్తుంటారని, పట్టువిడుపుల ధోరణి ప్రదర్శిస్తుంటారని తెలిపారు. 'నేను', 'నా వల్లే ఇదంతా జరగాలి' అనుకునే ఇగోయిస్టులకు కేసీఆర్ తీరు కనువిప్పు కావాలని హితవు పలికారు. ప్రజా సంక్షేమం కోరుకునే నాయకులు కేసీఆర్ ను చూసైనా నేర్చుకోవాలని అన్నారు.
Somireddy Chandra Mohan Reddy
KCR
Telugudesam
Andhra Pradesh
Telangana

More Telugu News