Andhra Pradesh: ఇవాళ ఒక్క కేసు కూడా నమోదు కాలేదు: ఏపీ ఆరోగ్యమంత్రిత్వ శాఖ

AP Government says today no corona positive cases
  • కరోనాపై ఏపీ ఆరోగ్యమంత్రిత్వ శాఖ బులెటిన్
  • ఇవాళ 16 మందికి నెగెటివ్
  • మరో 60 మంది ఫలితాల కోసం నిరీక్షణ
ఏపీలో ఇంకా 60 మంది కరోనా వైద్య పరీక్షల ఫలితాలు రావాల్సి ఉందని, ఇవాళ ఇప్పటివరకు ఒక్క కేసు కూడా నమోదు కాలేదని రాష్ట్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ వెల్లడించింది. ఇవాళ 16 మందికి నెగెటివ్ వచ్చిందని, 195 మందిని ఆసుపత్రుల్లో పరిశీలనలో ఉంచామని పేర్కొంది. ఈ మేరకు కరోనాపై ఏపీ రాష్ట్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ బులెటిన్ విడుదల చేసింది. విదేశాల నుంచి రాష్ట్రానికి వచ్చిన 29,367 మందిని హోమ్ ఐసోలేషన్ లో ఉంచి పర్యవేక్షిస్తున్నట్టు బులెటిన్ లో పేర్కొన్నారు. ఇక, రాష్ట్రవ్యాప్తంగా 19 కరోనా పాజిటివ్ కేసులు ఉన్నట్టు వెల్లడించారు.
Andhra Pradesh
Corona Virus
Positive
COVID-19

More Telugu News