saitej: సినీ కార్మికుల కోసం విరాళం ప్రకటించిన హీరో సాయి తేజ్

Hero Sai tej donates 10 lakhs  to Cine workers
  • తెలుగు రాష్ట్రాలకు ఇప్పటికే విరాళం ప్రకటించిన సాయి తేజ్
  • రోజువారి సినీ కార్మికుల కోసం పదిలక్షల రూపాయల విరాళం  
  • చిరంజీవి నేతృత్వంలో ఏర్పాటు చేసిన ఛారిటీకి  అందజేస్తానన్న తేజ్
కరోనా వైరస్ వ్యాప్తి చెందకుండా చేసే పోరాటంలో భాగంగా దేశ వ్యాప్తంగా లాక్ డౌన్ ప్రభావం తెలుగు చిత్ర పరిశ్రమపైనా పడిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో సినీ కార్మికులకు అండగా నిలుస్తూ హీరోలు, దర్శకులు, నిర్మాతలు విరాళాలు ప్రకటిస్తున్నారు.

ఇటీవలే రెండు తెలుగు రాష్ట్రాలకు కలిపి రూ.10 లక్షలు విరాళంగా ఇచ్చిన విషయం తెలిసిందే.  తాజాగా, రోజువారి సినీ కార్మికుల కోసం పది లక్షల రూపాయల విరాళాన్ని సాయి తేజ్ ప్రకటించాడు. ప్రముఖ హీరో చిరంజీవి నేతృత్వంలో ఏర్పాటు చేసిన ఛారిటీకి తన విరాళాన్ని ఇవ్వనున్నట్టు తేజ్ తెలిపాడు.
saitej
Tollywood
Donation
Cine workers

More Telugu News