SBI: బ్యాంకు ఉద్యోగులకు జాక్‌పాట్‌ : లాక్‌డౌన్‌ పీరియడ్‌లో రూ.2 వేలు అదనపు వేతనం

SBI and BOB employees get two thousand extra salary in lockdown period
  • ప్రకటించిన ఎస్‌బీఐ, బ్యాంక్‌ ఆఫ్‌ బరోడా యాజమాన్యాలు
  • మార్చి 23 నుంచి ఏప్రిల్‌ 14 మధ్య పనిచేసిన వారికి వర్తింపు
  • వర్క్‌ ఫ్రం హోం అవకాశం లేనందున ఈ బెనిఫిట్
కరోనా ప్రమాదం కారణంగా లాక్‌డౌన్‌ ప్రకటించినప్పటికీ బ్యాంకు శాఖలకు వెళ్లి తమ సేవలందిస్తున్న ఉద్యోగులకు ఎస్బీఐ, బ్యాంక్ అఫ్ బరోడా  యాజమాన్యాలు ఆర్థిక ప్రయోజనాన్ని ప్రకటించాయి. మార్చి 23వ తేదీ నుంచి ఏప్రిల్‌ 14వ తేదీ మధ్య కాలంలో విధులు నిర్వహించిన వారికి రెండువే రూపాయలు అదనంగా ఇవ్వనున్నట్లు ప్రకటించాయి. దేశీయ అతిపెద్ద బ్యాంక్‌ స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా తమ బ్యాంకు అన్ని శాఖల్లో సేవందిస్తున్న వారికి ఈ మొత్తం అందజేయనున్నట్లు తెలిపింది. అలాగే బ్యాంక్‌ ఆఫ్‌ బరోడా యాజమాన్యం కూడా తమ సిబ్బంది మాస్క్‌లు, గ్లౌజులు, శానిటైజర్లు కొనుగోలు చేసుకునేందుకు వీలుగా ఈ మొత్తం అందజేస్తున్నట్లు తెలిపింది. అలాగే రోజుకి కనీసం ఐదు ట్రాన్సాక్షన్లు నిర్వహించిన బీసీ ఏజెంట్లకు రూ.100 అందిస్తామని తెలిపింది.
SBI
BOB
Lockdown
Extra salary

More Telugu News