Corona Virus: ఢిల్లీ వెళ్లొచ్చిన నిజామాబాద్‌ వ్యక్తికి కరోనా.. దేశంలో మరింత పెరిగిన మృతుల సంఖ్య.. పాజిటివ్‌ కేసులు

  • గాంధీ ఆసుపత్రిలో నిజామాబాద్‌ వ్యక్తికి చికిత్స
  • దేశంలో మొత్తం 979 పాజిటివ్‌ కేసులు
  • ఇప్పటివరకు 25 మంది కరోనాతో మృతి
  • కోలుకున్న 86 మంది  
coronavirus cases in india

తెలంగాణలోని నిజామాబాద్‌లో తొలి కరోనా కేసు నమోదయిందని కలెక్టర్‌ నారాయణ రెడ్డి తెలిపారు. ఆ వ్యక్తి కుటుంబ సభ్యులను క్వారంటైన్‌కు తరలించామని తెలిపారు. ఈ నెల 12న ఢిల్లీ వెళ్లిన ఆ వ్యక్తి 15న నిజామాబాద్‌కు వచ్చారని తెలిపారు. ఈ నెల 26న బాధిత వ్యక్తి నిజామాబాద్‌ ప్రభుత్వ ఆసుపత్రిలో చేరగా సికింద్రాబాద్‌లోని గాంధీ ఆసుపత్రికి తరలించామని చెప్పారు.

కాగా, దేశంలో కరోనా కేసుల సంఖ్య 1000కి దగ్గరగా వెళ్తోంది. ఇప్పటివరకు 979 పాజిటివ్‌ కేసులు నమోదు అయ్యాయని కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ ప్రకటించింది. దేశంలో ఇప్పటివరకు 25 మంది కరోనాతో ప్రాణాలు కల్పోయారని తెలిపింది. 867 మంది బాధితులకు ఐసోలేషన్‌ వార్డుల్లో చికిత్స అందిస్తున్నట్లు చెప్పింది. ఇప్పటివరకు 86 మంది కరోనా నుంచి కోలుకున్నట్లు వెల్లడించింది.

More Telugu News