Narendra Modi: ప్రజలు నన్ను క్షమించండి: 'మన్‌ కీ బాత్‌'లో ప్రధాని మోదీ

modi coronavirus cases in india
  • లాక్‌డౌన్‌ వంటి అసాధారణ నిర్ణయాలు తీసుకోవాల్సి వస్తోంది
  • ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు
  • నాపై కొందరు ఆగ్రహంతో ఉన్నారని తెలుసు
  • కఠిన చర్యలు తీసుకోక తప్పట్లేదు 
ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ మన్‌ కీ బాత్‌లో ప్రజలతో మాట్లాడుతున్నారు. కరోనాపై పోరులో భాగంగా లాక్‌డౌన్‌ వంటి అసాధారణ నిర్ణయాలు తీసుకోవాల్సి వస్తోందని, ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, తనను క్షమించాలని వ్యాఖ్యానించారు. తనపై కొందరు ఆగ్రహంతో ఉన్నారని తనకు తెలుసని అన్నారు. అయినప్పటికీ, కరోనా వ్యాప్తిని అరికట్టడానికి ఈ కఠిన చర్యలు తీసుకోకతప్పదని చెప్పారు.

ముఖ్యంగా పేద ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని  మోదీ గుర్తు చేశారు. ప్రస్తుతం మనం ఎదుర్కొంటున్నది జీవన్మరణ సమస్య అయినందువల్లే కఠిన నిర్ణయం తీసుకున్నామని చెప్పారు. వైరస్ వ్యాప్తి ప్రారంభమైన రోజుల్లో చర్యలు తీసుకుంటేనే కరోనాను తొలగించవచ్చని అన్నారు. వైరస్ వ్యాప్తిని అరికట్టాలంటే దేశ ప్రజలు కొన్ని రోజులు లక్ష్మణ రేఖ దాటొద్దని వ్యాఖ్యానించారు.
Narendra Modi
Corona Virus
India

More Telugu News