కాకినాడలో 22 మంది అనుమానితుల నుంచి నమూనాల సేకరణ

29-03-2020 Sun 09:24
  • జీజీహెచ్‌కు వచ్చిన 22 మంది అనుమానితులు
  • జీజీహెచ్‌లో కోలుకున్న 23 ఏళ్ల యువకుడు
  • విశాఖలో  కుదుటపడుతున్న 66 కరోనా బాధితుడి ఆరోగ్యం
22 suspect men came to hospital in kakinada over corona virus symptoms
కరోనా వైరస్ లక్షణాలు కనిపించడంతో కంగారుపడిన 22 మంది కాకినాడలోని జీజీహెచ్‌కు రావడం కలకలం రేపింది. ఐసోలేషన్ వార్డుకు వచ్చిన వీరందరి నుంచి నమూనాలు సేకరించిన అధికారులు పరీక్షల కోసం ప్రయోగశాలకు పంపారు. జీజీహెచ్‌లో చికిత్స పొందుతున్న 23 ఏళ్ల యువకుడి ఆరోగ్యం నిలకడగా ఉన్నట్టు వైద్యులు తెలిపారు. మరికొన్ని రోజులు అబ్జర్వేషన్‌లో ఉంచిన అనంతరం డిశ్చార్జ్ చేస్తామన్నారు. మరోవైపు, విశాఖలో చికిత్స పొందుతున్న 66 ఏళ్ల వృద్ధుడికి శనివారం నిర్వహించిన మొదటి దశ పరీక్షల్లో కరోనా నెగటివ్ అని తేలింది. ప్రస్తుతం అతడిని ప్రత్యేక వార్డులో ఉంచి చికిత్స అందిస్తున్నారు. మరో నాలుగు రోజుల తర్వాత అతడికి మరోమారు పరీక్షలు నిర్వహిస్తామని, అందులోనూ నెగటివ్ అని వస్తే డిశ్చార్జ్ చేస్తామని వైద్యులు తెలిపారు.