Corona Virus: విశ్వరూపం దాల్చిన కరోనా భూతం.... 199 దేశాలకు పాకిన వైరస్

  • అమెరికాలో లక్ష దాటిన పాజిటివ్ కేసులు
  • తర్వాతి స్థానంలో ఇటలీ
  • ప్రపంచవ్యాప్తంగా 27,648 మంది మృతి
Corona virus looming over nations

నాలుగు నెలల కిందట చైనాలోని వుహాన్ లో ఉద్భవించిన అత్యంత ప్రమాదకర వైరస్ కరోనా (కొవిడ్-19) నేడు 199 దేశాలకు విస్తరించింది. కరోనా ప్రభావంతో ఆయా దేశాల్లో హడలిపోయే పరిస్థితులు నెలకొన్నాయి. ఓ మహమ్మారి రూపం దాల్చిన ఈ వైరస్ చైనా, అమెరికా, ఇటలీ, స్పెయిన్, ఇరాన్, ఫ్రాన్స్ తదితర దేశాల్లో భారీగా ప్రాణాలను బలిగొన్నది. ప్రపంచవ్యాప్తంగా పాజిటివ్ కేసుల సంఖ్య 6 లక్షలు దాటగా, మృతుల సంఖ్య 27,648కి చేరింది. 1,24,326 మంది కరోనా నుంచి కోలుకున్నారు.

కరోనా కేసుల్లో అమెరికా ఇప్పుడు అగ్రస్థానంలో ఉంది. అగ్రరాజ్యంలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య లక్ష దాటింది. అమెరికా తర్వాత 86,498 కేసులతో ఇటలీ రెండో స్థానంలో ఉంది. కరోనాకు జన్మస్థానంగా భావిస్తున్న చైనా 81,340 కేసులతో మూడోస్థానంలో ఉంది. స్పెయిన్ లో 64,059, జర్మనీలో 49,344, ఇరాన్ లో 32,332,  బ్రిటన్ లో 14,543, స్విట్జర్లాండ్ లో 12,311, దక్షిణ కొరియాలో 9,332, నెదర్లాండ్స్ లో 8,603 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి,.

More Telugu News