Corona Virus: వుహాన్ లో ఆంక్షల తొలగింపు... పోలీసులపై దాడికి దిగిన ప్రజలు!

  • కరోనాకు జన్మస్థానంగా వుహాన్ కు గుర్తింపు
  • కరోనా కేసులు తగ్గడంతో వుహాన్ లో లాక్ డౌన్ ఎత్తివేత
  • ఒక్కసారిగా బయటికి వచ్చిన ఇతర ప్రాంతాల ప్రజలు
కొన్నినెలల కిందటి వరకు చైనా హుబేయ్ ప్రావిన్స్ లో ఉన్న వుహాన్ నగరం అంటే ఎవరికీ పెద్దగా తెలియదు. అయితే, కరోనా వైరస్ జన్మస్థానంగా  వుహాన్ ఇప్పుడు ప్రతి ఒక్కరికీ తెలిసింది. తాజాగా వుహాన్ లో కరోనా పాజిటివ్ కేసులు తగ్గిపోవడంతో అక్కడ లాక్ డౌన్ ఆంక్షలు ఎత్తివేశారు.

ఇన్నాళ్లు అక్కడ నిర్బంధంలో మగ్గిన ఇతర ప్రాంతాల ప్రజలు ఒక్కసారిగా బయటికి రావడంతో తీవ్ర కోలాహలం ఏర్పడింది. అక్కడి నుంచి పొరుగున ఉన్న జియాంగ్ షీ ప్రావిన్స్ కు వెళ్లేందుకు ప్రజలు భారీ సంఖ్యలో సరిహద్దు వద్దకు రావడంతో  ఉద్రిక్తతలు ఏర్పడ్డాయి. పోలీసులు అడ్డుకోవడంతో వారు రెచ్చిపోయారు. పోలీసులపైన దాడి చేయడమే కాకుండా, వారి వాహనాలను సైతం ధ్వంసం చేశారు. హుబేయ్ ప్రావిన్స్ కు, జియాంగ్ షీ ప్రావిన్స్ కు మధ్య ఉన్న ఓ వంతెనను పోలీసులు మూసివేయడం ప్రజల ఆగ్రహానికి కారణమైంది.
Corona Virus
Wuhan
china
Police
COVID-19

More Telugu News