పీఎం కేర్స్ ఫండ్ కు రూ.25 కోట్ల భారీ విరాళం ప్రకటించిన అక్షయ్ కుమార్

28-03-2020 Sat 19:22
  • పీఎం కేర్స్ ఫండ్ కు విరాళాలు ఇవ్వాలని మోదీ విజ్ఞప్తి
  • ప్రధాని పిలుపుకు స్పందించిన బాలీవుడ్ స్టార్
  • ప్రాణాలుంటేనే జీవించగలమని అక్షయ్ వ్యాఖ్యలు
Bollywood Hero Akshay Kumar donates a huge some of twenty five crores to PM Cares Fund

దేశంలో 21 రోజుల లాక్ డౌన్ విధించిన నేపథ్యంలో విరివిగా విరాళాలు ఇవ్వాలన్న ప్రధాని నరేంద్ర మోదీ విజ్ఞప్తికి బాలీవుడ్ స్టార్ అక్షయ్ కుమార్ స్పందించారు. ప్రధాని ఏర్పాటు చేసిన పీఎం కేర్స్ ఫండ్ కు రూ.25 కోట్ల భారీ విరాళం ప్రకటించారు. ఇప్పుడు ప్రతి విషయం దేశ ప్రజల ప్రాణాలకు సంబంధించినదేనని అక్షయ్ కుమార్ ఈ సందర్భంగా ట్వీట్ చేశారు.

మనవాళ్ల కోసం ఏదో ఒకటి చేయాల్సిన అవసరం ఉందని, తాను పొదుపు చేసిన డబ్బు నుంచి పాతిక కోట్ల రూపాయలు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఏర్పాటు చేసిన పీఎం కేర్స్ ఫండ్ కు విరాళంగా ఇస్తున్నానని తెలిపారు. "మనం ప్రాణాలను కాపాడుదాం. ప్రాణాలుంటేనే జీవించగలం" అంటూ స్పందించారు.