Nagarjuna: టాలీవుడ్ సినీ కార్మికుల కోసం నాగార్జున భారీ విరాళం

  • లాక్ డౌన్ తో తీవ్రంగా నష్టపోతున్న సినీ కార్మికులు
  • ఉపాధి లేక అలమటిస్తున్న వైనం
  • రూ.1 కోటి విరాళం ఇస్తున్నట్టు నాగ్ వెల్లడి
Nagarjuna donates one crore towards Tollywood cine workers welfare

కరోనా వైరస్ భూతంపై పోరాటంలో భాగంగా దేశవ్యాప్తంగా 21 రోజుల లాక్ డౌన్ విధించిన సంగతి తెలిసిందే. లాక్ డౌన్ తో అన్ని వ్యవస్థలతో పాటు సినీ పరిశ్రమ కూడా స్థంభించిపోయింది. టాలీవుడ్ పై ఆధారపడిన దినసరి కూలీలకు లాక్ డౌన్ నిర్ణయం విఘాతంలా పరిణమించింది. ఈ క్రమంలో సినీ కార్మికుల కోసం అగ్రహీరో నాగార్జున రూ.1 కోటి విరాళం ప్రకటించారు. ఈ సందర్భంగా ఆయన సందేశం ఇచ్చారు. కరోనా నుంచి మనల్ని మనం కాపాడుకోవాలంటే లాక్ డౌన్ తప్పనిసరి అని, ఇంట్లోనే ఉండడం ద్వారా ప్రతి ఒక్కరూ తప్పకుండా పాటించాలని సూచించారు.

అటు, చిరంజీవి సినీ కార్మికుల కోసం ప్రత్యేక చారిటీ ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే. తమ విజ్ఞప్తి మేరకు సినీ కార్మికుల సంక్షేమం కోసం ఇప్పటివరకు రూ.3.8 కోట్ల విరాళాలు వచ్చాయని చిరంజీవి వెల్లడించారు. నాగార్జున రూ.1 కోటి, దగ్గుబాటి ఫ్యామిలీ రూ.1 కోటి, రామ్ చరణ్ రూ.30 లక్షలు, మహేశ్ బాబు రూ.25 లక్షలు, జూనియర్ ఎన్టీఆర్ రూ.25 లక్షలు ఇచ్చారని వివరించారు. అందరికంటే ముందు చిరంజీవి సినీ వర్కర్ల కోసం రూ.1 కోటి విరాళం ప్రకటించారు.

More Telugu News