Corona Virus: ఇక రైలు బోగీలే ఐసోలేషన్ కేంద్రాలు... ఫొటోలు ఇవిగో!

  • దేశంలో విస్తరిస్తోన్న కరోనా మహమ్మారి
  • నిలిచిపోయిన రైళ్లు
  • రైలు బోగీలను ఐసోలేషన్ వార్డులుగా మార్చిన కేంద్రం
Train coaches converted into Isolation wards

అమెరికా, ఇటలీ, స్పెయిన్ వంటి అగ్రరాజ్యాలతో పోల్చితే భారత్ కరోనా విషయంలో కాస్త ముందే మేల్కొన్నట్టు భావించాలి. అయితే, కరోనా కేసులు మరింత పెరిగితే క్వారంటైన్, ఐసోలేషన్ కేంద్రాలకు కొరత ఏర్పడుతుందన్న ఉద్దేశంతో కేంద్రం సరికొత్తగా ఆలోచించింది. దేశవ్యాప్తంగా రైళ్లు రద్దయిన నేపథ్యంలో రైలు బోగీలనే ఐసోలేషన్ కేంద్రాలుగా మార్చింది. రైలు బోగీ ఐసోలేషన్ కేంద్రాల ద్వారా గ్రామీణ ప్రాంతాల్లోనూ కరోనా వైద్యసేవలు అందించే వీలు కలుగుతుందని కేంద్రం భావిస్తోంది.

కాగా, ప్రతి కోచ్ లో 10 ఐసోలేషన్ వార్డులు ఏర్పాటు చేశారు. కోచ్ లోని కూపేలో సైడ్, మిడిల్ బెర్తులు తొలగించి ఇద్దరు నుంచి నలుగురు ఉండేందుకు అనువుగా రూపొందించారు. అంతేకాదు, కోచ్ లో ఉండే టాయిలెట్లను బాత్రూంలుగా అభివృద్ధి చేశారు. ప్రస్తుతం భారత్ లో 873 కరోనా పాజిటివ్ కేసులు నమోదు కాగా, 19 మంది మరణించినట్టు అధికారిక గణాంకాలు చెబుతున్నాయి.

More Telugu News