Doordarshan: పెరిగిన డిమాండ్... మళ్లీ పాత సీరియళ్లను బయటికి తీస్తున్న దూరదర్శన్!

Doordarshan re telecasts old serials like Ramayan and Mahabharat
  • కరోనా కారణంగా దేశవ్యాప్త లాక్ డౌన్
  • ఇళ్లకే పరిమితమైన ప్రజలు
  • నేటి నుంచి రామాయణ్, మహాభారత్, సర్కస్ సీరియళ్ల ప్రసారం
కరోనా దెబ్బకు దేశవ్యాప్తంగా లాక్ డౌన్ ప్రకటించడంతో ప్రజలందరూ ఇళ్లకే పరిమితమైన పరిస్థితి వచ్చింది. ఇప్పుడు టీవీ చూడడం అనేది అత్యంత ప్రాధాన్య అంశంగా మారింది. ఇదే అదనుగా దూరదర్శన్ చానల్ తన పాత హిట్ సీరియళ్ల దుమ్ముదులిపి బయటికి తీస్తోంది. రామాయణ్ సీరియల్ ను పునఃప్రసారం చేస్తున్నట్టు ఇటీవలే ప్రకటించిన దూరదర్శన్ యాజమాన్యం తాజాగా, మహాభారత్, సర్కస్ వంటి సూపర్ హిట్ సీరియళ్లను నేటి నుంచి మళ్లీ ప్రసారం చేసేందుకు సన్నాహాలు చేస్తోంది. ఈ మేరకు ప్రోమోలు కూడా రిలీజయ్యాయి.

ప్రస్తుతం బాలీవుడ్ లో సూపర్ స్టార్ గా పేరుప్రతిష్ఠలు సంపాదించిన షారుఖ్ ఖాన్ మొదట్లో బుల్లితెర నటుడు. 1989లో వచ్చిన సర్కస్ సీరియల్ ద్వారా షారుఖ్ ఎంతోమంది అభిమానులకు దగ్గరయ్యాడు. ఇప్పుడు మళ్లీ నాటి షారుఖ్ ను బుల్లితెర సీరియల్ లో చూసే అవకాశాన్ని దూరదర్శన్ కల్పిస్తోంది.
Doordarshan
Ramayan
Mahabharat
Circus
Old Serials

More Telugu News